అమాత్యుల ఆగ్రహం కడపకు శాపం
Publish Date:Mar 27, 2012
Advertisement
కడపజిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరి ఆగ్రహం కడపజిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి శాపంగా మారింది. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి వారంరోజుల క్రితం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిపై విమర్శలు చేసి రాజీనామా లేఖ పంపారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పెద్దల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన నాయకులను, కేడర్ ను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. జిల్లానుంచి మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు నాయకుల్లో ఇద్దరు అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతుండటంతో జిల్లాలో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. త్వరలో కడపజిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఇలా వ్యవహరించడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు భయపడుతున్నారు. కార్యకర్తల్లో ఇప్పటికే చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ ఇద్దరు మంత్రుల నిర్వాకంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే యోచనలో ఉన్నారు. మంత్రి సి.రామచంద్రయ్య పదవిని అధిష్టించి కొద్దిరోజులే అయినప్పటికీ ఆయన పార్టీపై ఇంతలా విరుచుకుపడటానికి కారణం ఏమిటన్న దానిపై కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ పోటీ చేసే అవకాశం తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికీ ఇవ్వాలని రామచంద్రయ్య పట్టుబడుతున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించడం లేదు. దీంతో రామచంద్రయ్య తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/kadapa--district-mlas-24-12940.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





