కాదంబరి జిత్వానీ కేసు దర్యాప్తు అధ్వానం.. ఏబీవీ సంచలన వ్యాఖ్యలు.!
Publish Date:Aug 4, 2026
Advertisement
ముంబైకి చెందిన సినీ నటి, మోడల్ కాదంబరి జెత్వాని వేధింపుల ఉదంతంపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా..ఏపీ పోలీసు హిస్టరీలో, ఏపీ ఏమిటి ఇండియాలోనే ఈ తరహా కేసు గతంలో ఎన్నడూ జరిగి ఉండదన్న ఏబీ వెంకటేశ్వరరావు.. కాదంబరి జత్వానీ కేసు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాల్సిన కేసు అని వ్యంగ్యంగా అన్నారు. కంచే చేను మేసిన చందంగా కాదంబరి జత్వానీ కేసులో కొందరు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉండటం శోచనీయమన్న ఏబీవీ.. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. బాధితురాలికి న్యాయం జరగడమే కాకుండా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకులను ఇబ్బందులకు గురిచేసే సంస్కృతి వ్యవస్థకు మంచిది కాదన్నారు. అసలు కాదంబరి జత్వానీ కేసులో తొలి నుంచీ నిబంధనలను పట్టించుకోకుండానే వ్యవహరించారన్న ఏబీవీ.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసు నీరుగారేలాగే దర్యాప్తు సాగిందని విమర్శించారు. వాస్తవానికి జిత్వానీని పోలీసు కస్టడీలోకి తీసుకున్న సమయంలోనే ముంబై గొడవలో ఆమె పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలన్న బెదరించారని ఆమే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జిందాల్ కేసు వ్యవహారంలో దర్యాప్తు పూర్తిగా చేయలేదన్న ఆయన సీఐడీ అంత అధ్వానంగా వ్యవహరించిందని విమర్శించారు. ఒక హెడ్ కానిస్టేబేల్ కూడా ఇంత దారుణంగా దర్యాప్తు చేయరన్నారు. ప్రజల డబ్బు తో జీతాలు తీసుకునే పోలీసులు అధికారం, దన బలం ఉన్న వారి కోసమే పని చేస్తున్నారు. జిత్వానీ కేసులో ఇద్దరినే సాక్షులు గా పెట్టారనీ, వారిద్దరి స్టేట్ మెంట్లూ మక్కీకి మక్కీ ఒకేలా ఉండటమే దర్యాప్తు ఎంత దౌర్భాగ్యంగా సాగిందో చెప్పడానికి ఉదాహరణ అన్నారు. ఈ కేసులో సీఐడీ తీరు దారుణమన్నారు. ఎవరి ప్రయోజనాలనో కాపడాడానికే సీఐడీ దర్యాప్తు సాగిందన్నారు. దురదృష్ట వశాత్తూ గతంలో నూ ఇప్పుడూ కూడా కాదంబరి జత్వానీ కేసు విషయంలో బాధితురాలికి న్యాయం జరిగేలా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం ఐపీఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే అంశమని ఘాటుగా విమర్శించారు. బాధితురాలు ఎదుర్కొన్న మానసిక, శారీరక వేధింపులకు కారణమైన వారిని విడిచిపెట్టకూడదని అభిప్రాయపడ్డారు. పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే సమాజంలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఏబీవీ పేర్కొన్నారు. ఏదైనా కేసు నమోదు చేసే ముందు నిబంధనల ప్రకారం వ్యవహరించాలా లేదా అనే ప్రాథమిక సూత్రాలను కూడా పక్కనపెట్టి అధికారులు ప్రవర్తించడం దారుణమన్నారు. Kadambari Jethwani case investigation in shambles, ABV, Sensational, Cpmments
http://www.teluguone.com/news/content/kadambari-jethwani-case-investigation-in-shambles-36-227967.html





