జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా.. అభిశంసనకు ముందు సంచలన నిర్ణయం

Publish Date:Apr 10, 2026

Advertisement

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి శుక్రవారం (ఏప్రిల్ 10) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.    రాజీనామా చేయాలని ఆయనకు గతంలోనూ సూచనలు అందినప్పటికీ అప్పట్లో ఆయన అందుకు నిరాకరించారు.  ఇప్పుడు ఆయన తప్పుకోవడం న్యాయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. 

గత ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు   కనిపించింది. కాలిపోయిన నోట్లతో పాటు కొన్ని వందల నోట్ల కట్టలు బయటపడటంతో ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.

అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నగదుతో తనకు సంబంధం లేదని ఆయన వాదించినప్పటికీ విచారణలో ఆ నగదు ఆయన నివాసంలోనిదే అని తేలింది.  ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియను ప్రారం భించేందుకు   146 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతోనే ఇప్పుడు ఆయన  రాజీనామా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. 

ఇలా ఉండగా, యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి పంపిన లేఖలో   తన రాజీనామాకు గల కారణాలను వివరించకుండా..  ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పదవిలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే ఆయన ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి తీవ్ర ఆర్థిక ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అత్యంత అరుదు. 

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాతో ప్రస్తుతం సాగుతున్న అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందా లేదా అన్నవిషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజీనామా చేసిన తర్వాత అభిశంసన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం సదరు వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే. అయితే ఇక్కడ యశ్వంత్ వర్మపై  నమోదైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  

By
en-us Political News

  
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.