ఎన్టీఆర్, అమిత్ షా భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత

Publish Date:Aug 21, 2022

Advertisement

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ అమిత్ షా ఆహ్వానం మేరకు నోవాటెల్ హోటల్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హోంమంత్రి ఆయనను కలవాలని భావించారనీ, అందుకే ఆహ్వానించారనీ బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.  
మరోవైపు.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా మునుగోడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం రామోజీఫిల్మ్ సిటీలో రామోజీరావును కలిశారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది.

ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  

తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.