తాత మీద ప్రేమ మాటలకే పరిమితమా ఉత్తర కుమార!

Publish Date:Sep 22, 2022

Advertisement

కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ తీరు. మాటకు ముందు తాత, మాటకు తర్వాత తాత అంటూ తన తాతగారు నందమూరి తారక రామారావుపై ఎనలేని అభిమానం, గౌరవం, భక్తి ఉన్నాయని చెప్పుకునే జూనియర్.. తన తాత మానస పుత్రిక అయిన 'డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరు మారిస్తే "అమ్మతోడు అడ్డంగా నరికేస్తా" అనే రేంజ్ లో స్పందిస్తాడు అనుకుంటే 'అమ్మ అయ్యా' అని బతిమాలుతున్నాడు. 

తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అసలు ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు సైతం కోరుకోవడం లేదు. తాత అంత కాకపోయినా సినిమాల్లో అంతో ఇంతో రాణిస్తే మంచిదేగా అని మద్దతిస్తున్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. ఎవరికో భయపడో లేక ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన మిత్రుల మెప్పు కోసమో అన్నట్టుగా మెతక వైఖరి చూపించడమే నందమూరి అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

 తన మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో ఆటో వెనక రాసే కొటేషన్ లా సింపుల్ గా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి మమ అనిపించాడు. మేనత్త మీద ఆయనకున్న ప్రేమ అంతేనేమో లేక సినిమాల్లో చూపించే రౌద్రం బయట చూపించలేడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు తన దైవం అని చెప్పుకునే తాతకి అవమానం జరిగినా ఆయన తీరు అలాగే ఉంది. ఆటం బాంబులా పేలతాడు అనుకుంటే.. తడిసిన చిచ్చుబుడ్డిలా తుస్సుమనిపించాడు.

 ‘‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’ ఇదీ జూనియర్ చేసిన ట్వీట్.

ఉప్పు వేయకుండా పప్పు చేసినట్టు, మసాలా లేకుండా నాన్ వేజ్ వండినట్టు.. విషయం లేని ట్వీట్ ఒకటి చేసి చేతులు దులుపుకున్నాడు. పైగా ఆ ట్వీట్ లో వైఎస్సార్ భజన ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహం తెప్పించేలా చేసింది.

 తాతగారి పేరుని తొలగించడాన్ని ఖండిస్తున్నాను  అని సింపుల్ గా ఒక ముక్కలో ట్వీట్ వేసినా  సర్లే ఈ జూనియర్ తీరు అంతే  అనుకొని అభిమానులు సరిపెట్టుకునేవారేమో. కానీ  మా తాత, మీ తండ్రి గొప్పోళ్ళు  అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సుకి హాయి కలిగించే మాటతో ట్వీట్ ప్రారంభించి అభిమానులకు మంట పుట్టేలా చేశాడు. అంటే తన దృష్టిలో ఎన్టీఆర్, వైఎస్సార్ సమానమేనా? ఇద్దరి స్థాయి ఒక్కటేనా?. తాత పేరుని తొలగిస్తే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి.. ఆయనతో వైఎస్సార్ ను పోలుస్తూ ఈ భజన ఏంటి? 

సినిమాల్లో పడి జూనియర్ గతం మరచినట్టున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేస్తే 'బుడ్డోడు' అంటూ హేళన చేశారు వైఎస్సార్. దాంతో జూనియర్ అప్పట్లో ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు చేశాడు. అంతేనా తాను నటించిన ఒక సినిమాలో "బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా" అనే డైలాగ్ కూడా పెట్టుకున్నాడు. మరి ఆ ఫైర్ ఇప్పుడేమైంది. తన తాతని అవమానిస్తే  మీరు చేసింది తప్పు  అని నేరుగా జగన్ సర్కార్ ని ఒక్క మాట అనలేక.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ఈ దిక్కుమాలిన ట్వీట్ ఏంటి? నీ కంటే వైఎస్సార్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల నయం. 'ఎన్టీఆర్ పేరు మార్చడం తప్పు' అని విస్పష్టంగా చెప్పింది. నీ జీవితం తాతకి అంకితం అని చెప్తావుగా, మరి అలాంటి తాతని అవమానిస్తే.. ఆవేదనతో, ఆగ్రహంతో ఇది తప్పని చెప్పాల్సింది పోయి.. నీ స్వార్థం కోసం ఈ ఉత్తరకుమార ట్వీట్ చేస్తావా అంటూ అభిమానులు ఆగ్రహంతో    విరుచుకుపడుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.