బీజేపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం?.. రామ్ చరణ్, ప్రభాస్ కూడా!

Publish Date:Nov 2, 2023

Advertisement

తెలంగాణలో బీజేపీ పరిస్థితి తిరోగమన దిశలో సాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. కొంత కాలం క్రితం వరకూ బయట పార్టీల నుంచి వచ్చి చేరిన బలమైన నేతలతో రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపించిన కమలం పార్టీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఒక్కొక్కటిగా రేకలు రాలిపోయినట్లు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమౌతున్నారు. గతంలో ఏ నేతల వల్లనైతే బీజేపీ బలంగా కనిపించిందో.. ఆ నేతలే పార్టీని వీడటంతో  రాష్ట్రంలో  బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం  రాష్ట్రంలో బీజేపీ బలహీన పడిందన్న విషయాన్ని గుర్తించినా కూడా అధికారమే లక్ష్యంగా  పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడం, కర్నాటకలో  ఆ పార్టీ చేతిలో ఎదురైన పరాజయ పరాభవం మరచిపోకముందే.. తెలంగాణలో మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడంతో.. కొత్త కొత్త వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదుర్కొనేందుకు సమాయత్తమౌతున్నది. ఆ వ్యూహాలలో భాగంగానే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున స్టార్ నటులను ప్రచార రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ప్రేక్షకులలో విశేష  ఆదరాభిమానాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను బీజేపీ  తరఫున ప్రచారానికి తీసుకురావాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వారి అంగీకారాన్ని  తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో పార్టీ విజయావకాశాలను వీరి ప్రచారం గణనీయంగా పెంచుతుందని పార్టీ అగ్రనేతలు విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు.  పాన్ ఇండియా స్టార్లుగా విశేష గుర్తింపు, ప్రేక్షకాభిమానం ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు పార్టీ తరఫున ప్రచారం చేస్తే విజయావకాశాలు  పెరుగుతాయన్నది ఆ  పార్టీ అగ్రనేతల వ్యూహంగా చెబుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్‌లతో తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇప్పటికే  కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీ అయిన సంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్‌తో.. అమిత్‌షా గతంలో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  అలాగే మరో సంరద్భంలో రామ్ చరణ్ తో  కూడా అమిత్  షా భేటీ అయ్యారు. ఇక  ప్రభాస్ తో అయితే ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు బతికి  ఉన్న రోజులలోనే భేటీ అయ్యారు. స్వయంగా  కృష్ణం  రాజు ప్రభాస్ ను  అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారు.

కాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభాస్ గ్రేటర్ హైదరాబాద్ లోనూ,  రామ్ చరణ్ ను ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, జూనియర్  ఎన్టీఆర్ ను  ఖమ్మం, నల్గొండ, వరంగల్  లలో ప్రచారం చేయించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా సెటిలర్ల ఓట్లతో పాటు ఆయా సామాజిక వర్గాల ఓటర్లను కూడా వీరి ప్రచారం ప్రభావితం చేస్తుందని అంటున్నారు.  ఇక ఈ ముగ్గురు పాన్ ఇండియా సినీ స్టార్ల ప్రచార షెడ్యూల్ ను వారి వారి సినిమా షూటింగ్ లకు అంతరాయం లేకుండా ఉండేలా రూపొందించే విషయంలో కసరత్తు జరుగుతోందని అంటున్నారు.    

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.