నారా ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమేనా?

Publish Date:Nov 18, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు అందరూ హైదరాబాద్ లో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. పలువురు నారావారి పల్లెకు చేరుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం నారా రామ్మూర్తి నాయుడి మృతి పట్ల కనీసం సంతాపం కూడా తెలపలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. 

నారా రామ్మూర్తినాయుడి మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సంతాపం  వ్యక్తం చేయకపోవడం, అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైందిని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.