మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్. ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఉప ఎన్నిక గురించిన చర్చే జరుగుతోంది. ఆ చర్చలకు తగ్గట్టే అక్కడి రాజకీయాలు రంగులు మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీ.. ఇక్కడ గెలుపే లక్ష్యంగా వలస రాజకీయాలను భారీగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలూ పావులు కదుపుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా.. స్థానిక నాయకులు కూడా అటు నుంచి ఇటూ ఇటు నుంచి అటూ పార్టీలు మారుతూ.. తమ తమ డిమాండ్లను నెరవేర్చుకుంటున్నారు.
తాజాగా.. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చండూరు మండలం దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్.. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో.. ఆయనపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.. దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరేలా పావులు కదిపింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో దేవేందర్ మళ్లీ కారెక్కారు.
వలస రాజకీయాలను ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు సైతం ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి.. తమ తమ పార్టీల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు బీజేపీ, కాంగ్రెస్ లు ముమ్మరంగా చేస్తున్నారు. కాంగ్రెస్ మాట ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ను వేగం చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీలో చేరికలను పెంచుతున్నారు. గతంలో ఉన్న పరిచయాలతో.. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల వరకు.. అందర్నీ బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jump-jilanis-in-munugodu-25-143395.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.