జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె. గోస్వామికి.. రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ ఉన్న బ్యారక్‌కు వచ్చిన మరో ఖైదీ ఆయనను బెదిరించారని లేఖలో తెలిపారు. బెదిరించిన వ్యక్తి దగ్గర కత్తి కూడా ఉందని అందులో వివరించారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. రామకృష్ణకు ప్రాణ హాని విషయమై ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రామకృష్ణను మరో బ్యారక్‌లోకి మార్చామని చెప్పగా.. పూర్తి వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ తర్వాత జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకి తరలించారు అధికారులు.
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే, జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్‌లోని మరో ఖైదీ బెడ్ కింద కత్తి ఉండటం ప్రస్తుత వివాదానికి కారణం.
సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతానని రామకృష్ణను ఆ ఖైదీ బెదిరించాడని.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖైదీని మరో బ్యారెక్‌కు తరలించారు. తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ జైలు నుంచి మార్చాలని పట్టుబట్టాడు. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. భోజనం చేయడానికి కూడా భయపడుతున్నానని తన తండ్రి తనతో చెప్పారని అన్నారు.
జైల్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని చంద్రబాబు నిలదీశారు.
జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో.. ఆయన్నుచిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు అధికారులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judge-ramakrishna-shifted-to-peeleru-sub-jail-25-116766.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.