Publish Date:Nov 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. సుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు షురూ అయ్యింది. నియోజకవర్గ పరిధిలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీ బైపోల్ లో 48.49శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అత్యధికంగా బోరబండ డివిజన్ లో 55.92 శాతం పోలింగ్ జరిగితే.. అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రక్రియను మొత్తం పది రౌండ్లలో పూర్తి చేయనున్నారు. గంట సేపటిలోగా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం రెండు గంటలకల్లా తుది ఫలితం వెల్లడౌతుందని అంచనా.
ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు. పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత రంగంలో ఉన్న సంగతి విదితమే. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-hills-by-poll-counting-started-25-209474.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.