నవంబర్ 11న జూబ్లీ బైపోల్
Publish Date:Oct 6, 2025
Advertisement
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ బైపోల్ వచ్చే నెల 11న జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల 13న ఎ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుదిగడువు. 22న నామినేషన్ల పరిశీలను ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఫలితం వెలువడుతుంది. జూబ్లీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని నియమించింది. జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే జూబ్లీ ఉప ఎన్నికలో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలెట్టేశారు. ఈ తరుఏణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నలుగురి పేర్లతో ఓ జాబితాను ఏఐసీసీకి సమర్పించింది. ఈ జాబితాలో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా పీసీసీ ప్రతిపాదించిన ఈ పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం చర్చించారు. మూమూలుగా అయితే ఆశావహులు అధికంగా ఉంటే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలు చివరి నిముషం వరకూ ఎటూ తేల్చకుండా నాన్చడం కద్దు. అయితే అలా నాన్చడం అసెంబ్లీ, జనరల్ ఎలక్షన్లలో అయితే ఓకే కానీ, ఒకే ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అలా నాన్చడం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిక జరిగేది ఒకే నియోజకవర్గానికి కావడంతో ప్రచారం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. అభ్యర్థిని ఎంత త్వరగా ప్రకటిస్తే అంత త్వరగా ప్రచారం ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానంపై అభ్యర్థి ప్రకటన చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అటు బీజేపీ శ్రేణులు సైతం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత రేసులో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/jublee-by-poll-on-14th-november-39-207452.html





