బీఆర్ఎస్ హైడ్రా పాలిటిక్స్ ...కొంపముంచేనా?

Publish Date:Nov 3, 2025

Advertisement

 

హైడ్రాతో జూబ్లీహిల్స్ ఎన్నికలను గట్టెక్కాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుందని మీ ఇళ్లను కూల్చివేస్తుందన ఓటర్లను భయపెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున హైడ్రా బాధితుల పేరుతో కొంతమందిని తీసుకు వచ్చి వారి బాధల్ని వినిపించారు. అందులో చిన్న పిల్లలు, వికలాగంలు,మహిళలు ,అనాధలు ఇలాంటి సమీకరణాల్ని చూసుకున్నారు. ఆ వీడియోలు వీలైనంతగా జూబ్లీహిల్స్ ప్రజలకు పంపుతారు. అంత వరకూ బాగానే ఉంది కానీ జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఓస్తే హైడ్రా మాత్రం రాకుండా ఉంటుందా అన్న డౌట్ ప్రజలకు వస్తే సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి వద్ద ఉంది.

ఓడితేనే హైడ్రా వస్తుంది.. గెలిస్తే రాదు !

జరుగుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక మాత్రమే. ఆ ఉపఎన్నిక సీటు కాంగ్రెస్ పార్టీ బలంపై ఎలాంటి ప్రభావం చూపదు. గెలిస్తే ఓ సీటు పెరుగుతుంది. కానీ ఓడిపోతే తగ్గదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించినా హైడ్రా చేయాలనుకుంటే తమ పనులు చేసేస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచే ఎమ్మెల్యే కూడా ఆపలేరు. తాము ఆపగలుగుతామని కూడా బీఆర్ఎస్ చెప్పడం లేదు. అక్కడే అసలు పాయింట్ ఉంది. కేవలం భయపెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారు. అంతకు మించిన ఆలోచన ప్రజలు చేస్తారని అనుకోవడం లేదు.

కాంగ్రెస్ ను ఓడించడం రెచ్చగొట్టడమే అని ఓటర్లు అనుకుంటే అంతా రివర్స్

ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొడితే రేపు తమ ఇళ్ల మీదకు హైడ్రాను తీసుకు వస్తే ఎవరు అండగా ఉంటారన్న ప్రశ్న బీఆర్ఎస్ ప్రచారం వల్ల ప్రజలకు వస్తుంది. అప్పుడు వారికి కనిపించే సమాధానం… కాంగ్రెస్ ను ఓడించడం ఎందుకు.. ఓ ఓటు వేస్తే పోలా అని. ఒక వేళ ఓటు వేసిన తర్వాత కూడా హైడ్రా వస్తే వారికి నవీన్ యాదవ్ ఉంటారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్. రాత్రికి రాత్రి వచ్చిన నేత కాదు. అక్కడ ప్రతి బస్తీలోనూ.. ఆయనకు అనుచరగణం..బలం ఉంటుంది. కాబట్టి ఆయన కాపాడుతారనే నమ్మకం ఉంటుంది.

బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటుందా?

నిజానికి జూబ్లీహిల్స్ లో హైడ్రాకు పని ఉండదు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. చెరువును కబ్జా చేస్తే మాత్రం హైడ్రా వెళ్తుంది. జూబ్లీహిల్స్ మొత్తం కిక్కిరిసిపోయిన జనవాసాల కాలనీలే ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కానీ.. హైడ్రా వరకూ వెళ్లలేదు. కానీ బీఆర్ఎస్ లోతుగా ఆలోచించలేక.. పూర్తిగా హైడ్రాను ఆయుధంగా చేసుకుంటుంది. ప్రజలు తమ జోలికి హైడ్రా రాకుండా ఉండాలంటే..కాంగ్రెస్‌కు ఓటేయడం బెటర్ అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయినట్లే. అయితే కాంగ్రెస్ ఎలా వాడుకుంటుది అన్నదానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది.


హైడ్రా కూల్చివేతలపై బాధితులతో కలిసి తెలంగాణ భవన్‌లో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు...ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’ కేటీఆర్‌ మండిపడ్డారు. 

మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం   చేస్తామని తెలిపారు.‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి  పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని ప్రశ్నించారు. ఒవైసీ స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని మండిపడ్డారు. 

By
en-us Political News

  
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.