జూబ్లీహిల్స్ పై చంద్రబాబు దృష్టి?

Publish Date:Jul 2, 2025

Advertisement

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్‌లో ఉన్న పాత టీడీపీ క్యాడర్‌కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది.  ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టు ఆ దిశగా తొలి అడుగా అంటే ఔననే సమాధానమే వస్తోంది.
వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై విడదల రజినిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది.
వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ లో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం (జులై 18)న ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్.. ఆ చార్జిషీట్ లో కీలక విషయాలను పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. శనివారం (జులై 19) ఆయనను విచారణకు పిలిచిన సిట్ దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన తరువాత అరెస్టు చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యాటనలో కపిలేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, అనంతరం శుభ్రంగా తుడిచారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలకుపైగా ఉన్న ప్రాధమిక ఛార్జ్‌షీట్‌‌ను సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ప్రధాని మోదీ దానిని నేరవేర్చారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెగా కోచ్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు
బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్‌లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు.
కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలి అని ఈటల రాజేందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.