Publish Date:Nov 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్ పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి.
ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని గౌరవించాలని సూచిస్తున్నారు.
ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-25-209351.html
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విడదల రజినీ తెలుగు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడానికి తోడు మంచి వాక్చాతుర్యం ఉండటంతో అనతి కాలంలోనే తెలుగుదేశం సీనియర్ల గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే అప్పట్లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడే చాన్స్ పొందారు.
విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు తీసుకురావడంలో కానీ.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ గతంలో చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా లోకేష్ నిర్వహిస్తున్నారు.
అరవ కామాక్షి చేసే గంజాయి దందాను అరికట్టాలని పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. తన గంజాయి దందాకు పెంచలయ్య ఆడ్డు వస్తున్నాడన్న కారణంగా అతడ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య తన బిడ్డను స్కూలు నుంచి తీసుకొస్తుండగా కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.