జూబ్లీహిల్స్ నుంచి..నిర్మాత దిల్ రాజు పోటీ?
Publish Date:Jul 17, 2025
Advertisement
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిర్మాత దిల్ రాజు దిగుతారా? అంటే అవుననే తేలుస్తోంది. ఆల్రెడీ ఆయన ఎఫ్ డీ సీ చైర్మన్ గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ అడుగు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇది బేసిగ్గా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. మాములుగా అయితే సెంటిమెంటు కొద్దీ మాగంటి గోపీనాథ్ భార్యకు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మరో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ కాకుండా.. రకరకాల పథక రచనలు చేస్తోంది. ఒక సమయంలో కేటీఆర్ సతీమణి శైలిమ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతకు ముందు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. తనకు ఛాన్స్ ఇస్తే మళ్లీ ప్రూవ్ చేసి చూపిస్తా అంటున్నారు. అయితే, ఆయన ఆశలు ఆశయాలు ఏమంత వర్కవుట్ అవుతున్నట్టు లేవు. దీంతో ఆయన హెచ్ సీ ఏ మీద పడ్డారు. తనకు హెచ్ సీ ఏ ఛాన్స్ ఇస్తే మంచిగా నడిపిస్తానంటున్నారు.కాంగ్రెస్ ఎలాగైనా సరే ఈ సీట్ ని గెలిచి తీరాల్సిందేనన్న గట్టి నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ తన వ్యూహ ప్రతివ్యూహాలతో సత్తా చాటాలని చూస్తున్నారు. అవసరమైతే.. ఈ సీటు తప్పక గెలవడానికి ఖమ్మం నుంచి ఒక తెలుగు బాగా మాట్లాడే మైనార్టీనైనా సరే రప్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ బేస్ చేసుకుని.. ఎన్డీఏ కూటమి ఇక్కడ తమ కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని ట్రై చేస్తోంది. ఇది వరకూ బీజేపీ ఎంపీ మాజీ ఏపీ చీప్ పురంధేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ కూటమి ఫలితం ఒక కొత్త రాజకీయ ప్రేరణగా అభివర్ణించారు. దీంతో ఇక్కడ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరైనా బరిలోకి దిగే ఛాన్సుంది. కూటమికి ఇక్కడున్న అవకాశాలేంటని చూస్తే.. ఈ ప్రాంతం దాదాపు కమ్మవారి కంచుకోట. తొలి నుంచీ ఇది టీడీపీ సీటే. గోపీనాథ్ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లిన వారే కాబట్టి.. ఆయన కూడా ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కాబట్టి.. ఆయనలా వరుసగా మూడు సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు.
ఇప్పుడు దిల్ రాజు విషయానికి వస్తే.. ఇదెలాగూ సినీ ప్రముఖులు అధికంగా నివసించే ప్రాంతం.. కమ్మ- కాపు- రెడ్డి అందరు హీరోలతో సినిమాలు తీసే నిర్మాత. ఆ ఇన్ ఫ్లూయెన్స్ ని వర్కవుట్ చేస్తూ.. ఇక్కడ పాగా వేయాలని దిల్ రాజు చూస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ రసవత్తర రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-25-202168.html





