Publish Date:Jul 17, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిర్మాత దిల్ రాజు దిగుతారా? అంటే అవుననే తేలుస్తోంది. ఆల్రెడీ ఆయన ఎఫ్ డీ సీ చైర్మన్ గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ అడుగు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇది బేసిగ్గా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. మాములుగా అయితే సెంటిమెంటు కొద్దీ మాగంటి గోపీనాథ్ భార్యకు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మరో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ కాకుండా.. రకరకాల పథక రచనలు చేస్తోంది. ఒక సమయంలో కేటీఆర్ సతీమణి శైలిమ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతకు ముందు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు.
తనకు ఛాన్స్ ఇస్తే మళ్లీ ప్రూవ్ చేసి చూపిస్తా అంటున్నారు. అయితే, ఆయన ఆశలు ఆశయాలు ఏమంత వర్కవుట్ అవుతున్నట్టు లేవు. దీంతో ఆయన హెచ్ సీ ఏ మీద పడ్డారు. తనకు హెచ్ సీ ఏ ఛాన్స్ ఇస్తే మంచిగా నడిపిస్తానంటున్నారు.కాంగ్రెస్ ఎలాగైనా సరే ఈ సీట్ ని గెలిచి తీరాల్సిందేనన్న గట్టి నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ తన వ్యూహ ప్రతివ్యూహాలతో సత్తా చాటాలని చూస్తున్నారు. అవసరమైతే.. ఈ సీటు తప్పక గెలవడానికి ఖమ్మం నుంచి ఒక తెలుగు బాగా మాట్లాడే మైనార్టీనైనా సరే రప్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక జూబ్లీహిల్స్ బేస్ చేసుకుని.. ఎన్డీఏ కూటమి ఇక్కడ తమ కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని ట్రై చేస్తోంది. ఇది వరకూ బీజేపీ ఎంపీ మాజీ ఏపీ చీప్ పురంధేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ కూటమి ఫలితం ఒక కొత్త రాజకీయ ప్రేరణగా అభివర్ణించారు. దీంతో ఇక్కడ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరైనా బరిలోకి దిగే ఛాన్సుంది. కూటమికి ఇక్కడున్న అవకాశాలేంటని చూస్తే.. ఈ ప్రాంతం దాదాపు కమ్మవారి కంచుకోట. తొలి నుంచీ ఇది టీడీపీ సీటే.
గోపీనాథ్ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లిన వారే కాబట్టి.. ఆయన కూడా ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కాబట్టి.. ఆయనలా వరుసగా మూడు సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు.
ఇప్పుడు దిల్ రాజు విషయానికి వస్తే.. ఇదెలాగూ సినీ ప్రముఖులు అధికంగా నివసించే ప్రాంతం.. కమ్మ- కాపు- రెడ్డి అందరు హీరోలతో సినిమాలు తీసే నిర్మాత. ఆ ఇన్ ఫ్లూయెన్స్ ని వర్కవుట్ చేస్తూ.. ఇక్కడ పాగా వేయాలని దిల్ రాజు చూస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ రసవత్తర రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-39-202167.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది