మీడియాపై అవినాష్ బ్యాచ్ దాడి.. ఖండించిన జర్నలిస్ట్ యూనియన్లు

Publish Date:May 19, 2023

Advertisement

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై చేసిన దాడిని ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజేఏ ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి.. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని.. డిమాండ్ చేశాయి.  ఒక సంచలన కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం మీడియా బాధ్యత అని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఈ రకంగా బరి తెగించడం మంచి పద్దతి కాదన్నారు. ఇలా దాడుల ద్వారా మీడియాను అణిచివేయాలను కోవడం అవివేకమని ఆ జర్నలిస్ట్ యూనియన్లు పేర్కొన్నాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చంద్ జనార్థన్.. అలాగే ఎపి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఏచూరి శివ, డాక్టర్ మురళీ మోహన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది... అయితే తన తల్లి శ్రీలక్ష్మీ అనారోగ్య కారణంగాచూపుతూ.. ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. అయితే ఆ వాహనాన్ని అనసరిస్తూ.. కొన్ని మీడియా ఛానెళ్లకు చెందిన వాహనాలు వెంబడించాయి. ఈ నేపథ్యంలో సదరు వాహనాలపైనే కాకుండా.. సదరు చానెళ్లకు చెందిన జర్నలిస్టులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.. అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడిని జర్నలిస్ట్‌ల యూనియన్ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి.  

మరోవైపు  మే 16న విచారణకు హాజరుకావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ వాట్సప్‌లో నోటీసులు జారీ చేసింది. కానీ తనకు నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. మే 19వ తేదీ విచారణకు హజరుకావాలంటూ.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమే కాకుండా.. పులివెందులకు వెళ్లి.. ఆయన నివాసం వద్ద ఉన్న ఆయన కారు డ్రైవర్‌కు నోటీసులు అందజేశారు సీబీఐ అధికారులు. దీంతో మే 19వ తేదీన ఆయన సీబీబీ విచారణకు  అవినాష్ హాజరు కావాల్సి ఉంది. అయితే  చివరి నిమిషంలో ఆయన కారు.. పులివెందులకు పయనం కావడంతో.. మీడియా వాహనాలు.. ఆయన వాహనాన్ని అనుసరించడంతో.. ఆయన.. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారనే ప్రచారం ఊపందుకొంది. అలాంటి వేళ.. మీడియా వాళ్లపై అవినాష్ అనుచరులు దాడులకు తెగబడ్డారు.

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.