Publish Date:Jun 11, 2025
రాజధాని అమరావతిని, అమరావతి మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు బుధవారం (జూన్ 11) అరెస్ట్ చేశారు. వైసీపీ మీడియా చానెల్ లో ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడమే కాకుండా పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణంరాజును ఏ1గా చేర్చారు. ఇదే కేసులో ఇప్పటికే ఆ చానెల్ ఉద్యోగి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక అమరావతి మహిళలపై, అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును భీమిలి సమీపంలో అరెస్టు చేసి , నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనను గురువారం (జూన్ 12) కోర్టులో హాజరు పరుస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/journalist-krishnamraju-arrest-39-199738.html
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి.
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. వారంతం కావడంతో తిరమలేశుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ సీఎం కేండెట్ నేనేనంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు.
గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది.
ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.
అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి ఘన సంప్రదాయ స్వాగతం పలికింది.
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్‌లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది.