మహిళ ఐఏఎస్‌లపై అసత్య కథనాలు...పలువురిపై కేసు నమోదు
Publish Date:Jan 14, 2026
Advertisement
ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కీలక అరెస్టులు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ ఐఏఎస్ అధికారిని వ్యక్తిగ తంగా కించపరిచే విధంగా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగిం చేలా అసత్యాలు, అవమా నకర వ్యాఖ్యలతో కూడిన కథనాలను ఉద్దేశపూర్వ కంగా ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం మీడియా నైతికత ఉల్లంఘన మాత్రమే కాకుండా, చట్టపరమైన నేరంగా కూడా పరిగణిం చబడుతుందని సిసిఎస్ అధికారులు స్పష్టం చేశారు. 44 యూట్యూబ్ చానల్స్‌పై కేసులు ఈ వ్యవహారంలో టెలివిజన్ ఛానల్స్‌తో పాటు 44 యూట్యూబ్ చానల్స్ కూడా మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వీడి యోలు, చర్చలు, అభ్యంత రకర కంటెంట్ ప్రసారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయా యూట్యూబ్ చానల్స్ పై చట్టపరమైన చర్యలకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, దుష్ప్ర చారం చేయడం ద్వారా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అధికారిని అవమా నించే ప్రయత్నం చేసిన వారి ని గుర్తించే పనిలో నిమగ్న మయ్యారు. ఇప్పటికే పలు వురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులను గుర్తించి నట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా యూట్యూబ్ చానల్స్ నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో పడ్డ సిసిఎస్ పోలీసులు, వారిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చ రించారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసుల దూకు డుతో పలువురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొందరు వీడియోలను తొలగించగా, మరికొందరు తమ చానల్స్‌ను తాత్కా లికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే డిలీట్ చేసిన కంటెంట్ కూడా డిజిటల్ ఆధారాల రూపంలో తమ వద్ద ఉందని పోలీ సులు చెబుతున్నారు. మీడియాకు సిసిఎస్ హెచ్చరిక ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసులు మీడియా సంస్థ లకు కీలక హెచ్చరికలు చేశారు. వ్యక్తుల గౌరవం, ముఖ్యంగా మహిళా అధి కారుల ప్రతిష్టను దెబ్బ తీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు.జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన సుచించారు.జర్నలిస్టుల అరెస్ట్‌ను వెంటనే ఆపాలంటూ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మహిళా ఐఏఎస్ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం చేసిన కేసులో ఓ వార్తా సంస్థ ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రముఖ న్యూస్ ఛానల్‌పై సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లు సీజ్ చేశారు.
http://www.teluguone.com/news/content/journalist-arrest-36-212515.html





