కాంగ్రెస్’లో చేరికల చిచ్చు.. రేవంత్ వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్

Publish Date:Jul 8, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి ... చేరికలతో పాటుగా నిరసన స్వరాలు, వ్యతిరేక నినాదాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంత కాలంగా కొంత  గుంభనంగా  ఉన్న విబేధాలు భగ్గు మంటున్నాయి.

ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంతవరకు ఆయన పార్టీపై పట్టు సాధించ లేక పోయారు. పీసీసీ కుర్చీలో కుదరుగా కూర్చున్నది లేదు, అందుకే పార్టీలో విబేధాలు రోజు రోజుకు పై మెట్టుకు చేరుతున్నాయే, తప్ప దిగిరవడం లేదని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలు రేపుతున్న చిచ్చు విషయానికి వస్తే, పైన అనుకున్న విధంగా ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది.

తాజాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ నేత  మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని, సగౌరవంగా పార్టీలోకి స్వాగతించారు. ఎర్ర శేఖర్ తో పాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్’లో సందడి చేశారు. కానీ, ఆ  సందడి పూర్తిగా సర్డుమణగక ముందే ఎర్ర శేఖర్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల విమర్శలు మొదలయ్యాయి. నేర చరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు, అంటూ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు.

అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతే కాదు, ఎర్ర శేఖర్ ఎంట్రీ పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అదలా ఉంటే కొంతకాలం వెనక్కి వెళితే, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని, సస్పెన్షన్ ఎత్తివేయకుండా, మళ్ళీ పార్టీలోకి ఎలాతీసుకుంటారని రేవంత్ రెడ్డి వర్గం, కోమటి రెడ్డిని తప్పు పట్టింది.

అంతేకాదు, మర్యాద పూర్వకంగా పీసీసీ చీఫ్ కు కలిసేందుకు ఇంటికొచ్చిన వడ్డేపల్లి ముఖం మీదనే రేవంత్ రెడ్డి తలుపులు వేశారు. రవిని రేవంత్ కలవలేదు. గేటు బయటి నుంచే వెనక్కి పంపించేశారు. ఇంకొంత వెనక్కి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అలిగి కూర్చున్నారు.  అలాగే,ఇటీవల సీఎల్పీ మాజీ నేత, పీజేఆర్ కుమార్తె, తెరాస కార్పొరేటర్ విజయా రెడ్డి, మళ్ళీ సొంత గూటికి చేరారు.

పీసీసే చీఫ్ రెంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన రెడ్డి మాత్రం, సోదరి చేరికను గట్టిగానే వ్యతిరేకించారు. తన సోదరి కాంగ్రెస్ పార్టీలో  చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ తనతో చర్చించలేదన్నారు. అంతే కాకుండా, రెంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను లంచ్ కి ఆహ్వానించి సమాలోచనలు జరిపారు. సోదరి విజయా రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన సీనియర్లతో సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నేపధ్యంలోనే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, పార్టీలో చేరుతున్న ఎవరికీ, టికెట్ హామీ ఇవ్వడం లేదని ప్రకటించారు. అయితే, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కుర్చీలో ముందుగా   కర్చీఫ్ వేసేందుకే, సీనియర్లను పక్కన పెట్టి, ఇతర పార్టీలలో తనకు మద్దతుగా నిలిచే వారిని ఏరి కోరి పార్టీలో చేర్చుకుంటున్నారని,సీనియర్ నేతలు అనుమానిస్తున్నారు.

అందుకే కావచ్చును, రేవంత్ రెడ్డి తాజాగా, సోనియా గాంధీ ఎవరి పేరు చెపితే వారిని, పల్లకీలో భుజాన మోసుకెల్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెడతానని ప్రకటించవలసి వచ్చిందని అంటున్నారు. నిజానికి, ఒక్క చేరికల విషయంలోనే కాదు, ఇతరత్రా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ అన్న విధంగానే ఇతర సీనియర్ నాయకుల ప్రవర్తన ఉంటోంది. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో  నిర్వహించిన చింతన శిబిర్ లో  ఆమోదించిన తీర్మనాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం, రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్వర్యంలో జూన్ 1 నుంచి రెండు  రోజులు హైదరాబద్’లో రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించింది. అలాగే, గతంలో రేవంత్ రెడ్డి,  రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలను అప్పగిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటీవల ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు ఏవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, గోడకేసి కోడతానంటూ చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి.  

ఇదలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంకా ఆయన పార్టీఫై పూర్తి పట్టును సాధించలేక పోయారు. సీనియర్లతో సయోధ్యత ఎండమావిగానే మిలిపోయింది. మరో వంక అయన దూకుడు పెంచిన కొద్దీ, పార్టీలో వ్యతిరేకత అదే స్థాయిలో పెరుగుతోంది,  ఎదురు తిరుగుతోంది. మరోవంక రేవంత్ రెడ్డి సారధ్యంలో  జరుగుతున్న చేరికలు ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునేందుకు పనికోస్తాయే తప్ప పార్టీ ఇమేజ్ ని పెంచేందుకు ఏ మాత్రం పనికొచ్చేవి కాదని, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నిజానికి, పార్టీలో కొత్తగా చేరుతున్న నేతల వలన నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, తిరుగుబాట్లు ఎదురయ్యే  ప్రమాదం ఉందని అంటున్నారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికతో, గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిండ్ దాసోజు శ్రవణ్  పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మరో వంక, రేవంత్ రెడ్డికి మొదటి నుంచి దూరంగా ఉంటున్న పీజేఆర్ కుమారడు విష్ణు వర్దన్  రెడ్డి రేపు ఏమి చేస్తారో .. తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ లో చేరికల సందడిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీలో చేరికలు చిచ్చుపెడుతున్నాయి అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోందని రాజకీయ పండితులు విశ్లేస్తిస్తున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి పార్టీ పాలిట మరో సిద్దూ అవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.