జోగి రమేష్.. జైలు నుంచి ఇలా బయటకు.. అలా జగన్ చెంతకు!

Publish Date:Jan 28, 2026

Advertisement

నేర చరిత ఉన్నవారినీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారినీ జగన్ చేరదీస్తారనీ, ప్రోత్సహిస్తారనీ రాజకీయవర్గాలలో ఓ అభిప్రాయం ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా కూడా జగన్ అదే ధోరణి అవలంబిస్తున్నారని పరిశీలకులు ఉదాహరణలు చూపుతూ విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి తాజాగా జరిగింది. 

కల్తీ మద్యం తయారీ కేసులో నిందితుడిగా అరెస్టై దాదాపు మూడు నెలలు రిమాండ్ ఖైదీగా ఉండి నాలుగు రోజుల కిందటే వచ్చిన జోగి రమేష్ సోదరులు ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా జగన్ అప్పాయింట్ మెంట్ సంపాదించేసి తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అయ్యారు.  గత ఎన్నికలలో ఓటమి తరువాత అడపాదడపా తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖం చూడని జగన్ ను వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకులు కలవాలన్నా ఎదురు చూపులు తప్పని పరిస్థితి. అటువంటిది కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, అరెస్టై బెయిలుపై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి మాత్రం జగన్ అప్పాయింట్ మెంట్ సునాయాసంగా దొరికేసింది.

మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం అంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న గంటల వ్యవధిలో జోగి రమేష్ కుటుంబం ఆయనతో భేటీ అయ్యింది.  జగన్ తో జోగి రమేష్ కుటంబ సమేతంగా భేటీ అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.   కల్తీ మద్యం తయారీ కేసులో అరెస్టై బెయిలుపై వచ్చిన జోగు రమేష్ కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ అప్పాయింట్ మెంట్ ఇవ్వడమే విమర్శలకు తావిస్తున్నది. నేర చరిత ఉన్నవారినీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారినీ జగన్ చేరదీస్తారనీ, ప్రోత్సహిస్తారనడానికి ఈ భేటీ తాజా తార్కానంగా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.