దేవుడితోనూ రాజకీయాలు.. జోగి రమేష్ ఒట్లను ఎవరైనా నమ్ముతారా?

Publish Date:Oct 27, 2025

Advertisement

వైసీపీ నేతలు రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడికి వెళ్లి ప్రమాణం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా, ఇంకా చెప్పాలంటే.. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్.. నకిలీ మద్యం కేసులో తాను నిర్దోషిననీ, తనకేమీ తెలియదనీ బుకాయిస్గున్నారు. అసలు ఈ కేసులో  ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియనే తెలియదనీ గట్టిగా చెబుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. అద్దేపల్లిజనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జోగి రమేష్ తన బుకాయింపులను కొనసాగిస్తున్నారు. 

నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే దుర్గమ్మ కాళ్ల వద్దే ఉరేసుకుంటానని ఈ సందర్భంగా జోగి రమేష్ అన్నారు. 

అయితే ఇక్కడ ఆయన ప్రమాణాలు, ప్రతిజ్ణలను జనం నమ్మే పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్ధనరావు పోలీసు కస్టడీలో విషయం మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఇందులో సందేహాలకు అతీతంగా జోగి రమేష్ ప్రమేయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించేశారు. ఈ నేపథ్యంలోనే జోగు రమేష్ దేవుడి మీద ప్రమాణాలంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైసీపీ అధికారంలో  ఉన్న సమయం నుంచీ జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్ల అద్దేపల్లి చెబుతున్నారు. అప్పటి లెక్కలు బయటపెట్టడమే కాకుండా.. తాజా నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారంలో జోగురమేష్ తో తాను చేసిన చాట్ల స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ బుకాయింపులను, ప్రమాణాలను, ప్రతిజ్ణలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.