యువత, విద్యార్థుల ఉద్యమానికి దిగివచ్చిన జార్ఖండ్ సర్కార్.!

Publish Date:Aug 18, 2026

Advertisement

జెన్ జీ పవర్ ఏమిటో ప్రభుత్వాలకు తెలిసి వస్తున్నది. విద్యా వ్యవస్థలో అవకతవకలు, అక్రమాలు, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై యువత, విద్యార్థులు గళమెత్తి, వీధుల్లోకి వచ్చి చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వాలు ఒకదాని తరువాత ఒకటి అన్నట్లుగా దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా యువత చేపట్టిన ఉద్యమం ధాటికి మోడీ సర్కార్ దిగివచ్చి ధర్మేంద్ర ప్రసాద్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే.

తాజాగా జార్ఖండ్ లో విద్యార్థులు, యువత తమ సమస్యలపై ఉద్యమ బాట పట్టారు.  జార్ఖండ్ లోక్ సేవా ఆయోగ్ , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఉద్యోగ ప్రకటనలు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ   విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. దీంతో దిగి వచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థి, యువత డిమాండ్లను అంగీకరిస్తూ ప్రకటన చేసింది. 

టీడీపీఎల్ అనే ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు.  వీటితో పాటు ఇటీవల నిర్వహించి వివాదాస్పద  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు.

ఈ నిర్ణయంతో పాటు, గతంలో జరిగిన అక్రమాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి అందుకు శ్రీకారం చుట్టారు. 2014  నుంచి జార్ఖండ్‌లో నిర్వహించిన అన్ని రకాల నియామక పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి సోరెన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై  సిట్, సీఐడీ విచారణలు జరుగుతున్నాయి. సీజీఎల్ పరీక్షా విధానం ద్వారా ఎంపికైన కొందరు అభ్యర్థులకు అక్రమాలతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశాయి.   కేవలం పరీక్షలు రాసిన అభ్యర్థులపైనే కాకుండా..  గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్వహించిన థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ కంపెనీల పాత్రపై కూడా  దర్యాప్తు జరగనుంది.  

Jharkhand Students Protest, Hemant Soren Decision, JSSC CGL Exam Cancelled, JPSC JSSC Aspirants Victory, Jharkhand Recruitment Exams Investigation

By
en-us Political News

  
ఈ మ్యాచ్‌లో  రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి  పది వికెట్లు నేలకూల్చి మానవ్ సుతార్ కొత్త చరిత్ర సృష్టించాడు.   భారత స్పిన్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ నమోదు చేసిన రికార్డులను బ్రేక్ చేశాడు.
శతాబ్దాలుగా పాక్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం వెనుకుండి చక్రం తిప్పుతున్నప్పటికీ, ఈ పదేళ్ల ప్రణాళిక ద్వారా సైనాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వ భాగస్వామిగా నిలబెట్టాలని భావిస్తున్నారు.
ఆగస్టు 19 నాటి బంగారం ధరల పూర్తి వివరాలు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 24 క్యారట్లు, 22 క్యారట్ల పసిడి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకోండి.
నింటేండో స్విచ్ 2 కోసం డియాబ్లో 4 లాంచ్ డేట్ లీక్ అయింది. సెప్టెంబర్ 15న ఏజ్ ఆఫ్ హేట్రెడ్ కలెక్షన్‌తో $69.99 ధరకు విడుదల కానున్న ఈ గేమ్ వివరాలు, ఎక్స్‌పాన్షన్లు మరియు ఫిజికల్ బాక్స్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న జాక్ రీచర్ సిరీస్‌పై మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! టామ్ క్రూజ్, అలన్ రిచ్‌సన్ మరియు లీ చైల్డ్ నవలల ఆధారంగా రూపొందించిన ఈ అల్టిమేట్ క్విజ్‌లో 70% స్కోర్ చేయడం నిజమైన అభిమానులకే సాధ్యం.
గూగుల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ ఫోటోస్కాన్ టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బాడీ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెడికల్ గ్రేడ్ ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు.
ప్రపంచకప్ టోర్నీలో బెల్జియం చేతిలో చేదు ఓటమి తర్వాత సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు తమ కోచ్ పేప్ తియావ్‌ను తొలగించి, ఫ్రాన్స్ దిగ్గజం ప్యాట్రిక్ వియెరాను నయా హెడ్ కోచ్‌గా నియమించింది. సెనెగల్ జట్టులో వచ్చిన ఈ సంచలన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి రూపాయి విలువ 95.73 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల మధ్య ఆర్‌బీఐ సమర్థవంతమైన జోక్యంతో భారత కరెన్సీకి లభించిన ఊరటపై పూర్తి వివరాలు ఇవే!
ఏఐ స్టాక్స్ సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొరియా కోస్పీ 5.2% తగ్గగా, శామ్‌సంగ్, ఎన్‌విడియా సహా దిగ్గజ టెక్ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతీయ యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షెహనాజ్ గిల్ మరియు రియాంజలి నంజప్పతో ఆయనకున్న రూమర్స్, ఐపీఎల్ స్టాండ్స్‌లో జరిగిన సంఘటనలు మరియు క్రికెట్ ప్రదర్శన వివరాలతో కూడిన సమగ్ర కథనం చదవండి.
బైయర్న్ మునిచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జామల్ ముసియాలా 4 రోజుల్లో 2 సార్లు మైదానంలో కుప్పకూలారు. తనకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించిన జర్మనీ ఫుట్‌బాల్ స్టార్. పూర్తి వివరాలు ఇవే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ రికీ పాంటింగ్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ సృష్టించబోతున్న చారిత్రాత్మక రికార్డు వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.