విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో జేడీ రాజకీయ పబ్బం!

Publish Date:Apr 17, 2023

Advertisement

విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యవహారంలో సీబీఐ మాజీ జేడీ తన రాజకీయ ప్రయోజనాలను వెతుక్కుంటున్నారా?  విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడానికి ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న  బృహత్ ఉద్యమాన్నినీరుగార్చైనా సరే తాను రాజకీయంగా లబ్దిపొందాలని భావిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కావడాన్ని వ్యతిరేకించాల్సిన నేతలు.. తామే  పెట్టుబడులు పెడతామంటూ ముందుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

జనంలో పలుకుడి, పాపులారిటీ కోసం.. విశాఖ ఉక్కు రక్షకులుగా ముద్ర కోసం.. అసలు లక్ష్యాన్ని వదిలేసి.. అసలు లక్ష్మానికే ఎసరు పెట్టేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు గురి అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పరిశ్రమకు నిధులు వచ్చేలా చేయాల్సిన నాయకులు.. అందుకు భిన్నంగా బిడ్ వేస్తాం, పెట్టుబడులు పెడతాం అంటూ కేంద్రం నెత్తిన పాలు పోస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రజల తరఫున అంటూ దాఖలు చేసిన బిడ్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ ఆయన వెన్స్ ప్రా ఇంపెక్స్ కంపెనీ  ద్వారా దాఖలు చేసిన బిడ్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పేరు మీదే బిడ్ దాఖలు చేస్తానని ప్రకటించిన లక్ష్మీనారయణ ఇప్పుడు కంపెనీ పేరుపై బిడ్ దాఖలు చేయడమేమిటని నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల ప్రమేయం లేకుండా దాఖలైన  ఈ బిడ్ ద్వారా ఆయన ఆశిస్తున్నదేమిటి?

నిన్న మొన్నటి వరకూ  వావిలాల గోపాలకృష్ణయ్య  పైసా ఉద్యమం స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే నెలలో రూ. 850 కోట్లు జమౌతాయని, అలా ఓ నాలుగు నెలలు జమ చేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చిని చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హఠాత్తుగా మాట  మార్చి కొత్త కంపెనీని తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రజల నుంచి సేకరించే కోట్లాది రూపాయల సొమ్మును ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ తాను ఏ కంపెనీ  పేరుతో బిడ్ దాఖలు చేశారో ఆ కంపెనీలో జమ చేస్తారా?  వచ్చే ఎన్నికలలో తాను విశాఖ నుంచి పోటీ చేస్తాననీ, ఒక వేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వక పోతే ఇండిపెడెంటుగానైనా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జేడీ.. విశాఖ ఉక్కును  ఎన్నికలలో తన  విజయానికి సోపానంగా ఉపయోగించుకోవడానికే ఫక్తు రాజకీయ వేత్తలా మాటలతో మాయ చేసి జనం చెవులలో పువ్వులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన కాలంలో జనంలో తన పట్ల ఏర్పడిన నమ్మకాన్నే వారిని వంచించడానికి పెట్టుబడిగా వాడుకుని జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.  తెలంగాణలో అధికారంలోఉన్నకేసీఆర్ సర్కార్   ‘బిడ్‌’లో పాల్గొంటున్నట్టు ప్రకటించగానే  దాన్ని జేడీ స్వాగతించిన  లక్ష్మీనారాయణ  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు దోహదపడే విధంగానే వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు.   విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను ఆలంబనగా చేసుకుని తన రాజకీయ బవిష్యత్ కు బాటలు వేసుకునేందుకు జేడీ చేస్తున్న ప్రయత్నంగా విశాఖ వాసులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.