టీడీపీ అభ్యర్థిగా విశాఖ నుంచి జేడీ లక్ష్మీనారాయణ?

Publish Date:May 25, 2022

Advertisement

తెలుగుదేశం గూటికి జేడీ లక్ష్మీనారాయణ చేరనున్నారు, ఆయన విశాఖ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో నిలబడనున్నారు. ఇప్పడు ఇదే రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్. గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా విశాఖ ఎంపీగా రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఓట్లు భారీగానే వచ్చాయి. అంతే కాకుండా ఆ ఎన్నికలలో ఓటమి చవి చూసినప్పటికీ, జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. వీటన్నిటినీ గమనిస్తే ఆయన మరో సారి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు, గత ఎన్నికలలో ఓడినా కూడా నియోజకవర్గాన్ని వదలకుండా సేవా కార్యక్రమాలలో నిమగ్నం కావడంతో ప్రజల సానుభూతి కూడా ఆయన వైపే ఉందని వారు పేర్కొంటున్నారు. అంతే కాకుండా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆయన చూపిన చొరవ, సాహసంతో జనంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో ఆయనకు రాష్ట్ర ప్రజలలో ఒక హీరోకు ఉండే ఇమేజ్ ఉండేది. ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన కోర్టులో పిల్ వేశారు.

ఇదే అంశంపై పలు సమావేశాలూ నిర్వహించారు. రుషి కొండ తవ్వకాలకు వ్యతిరేకంగానూ గళం  ఇలా ఆయన విశాఖ ప్రజలతో మమేకమయ్యారు.  జగన్ రెడ్డి సర్కార్ పై జనంలో పెల్లుబుతున్న ఆగ్రహావేశాలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల ఉనికి ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న  నేపథ్యంలో ఏపీలో జనసేన, టీడీపీలు మాత్రమే బలంగా కనిపిస్తున్నాయి. బలమైన పార్టీ అభ్యర్థిగా జేడీ విశాఖ నుంచి రంగంలో దిగితే ఆయన గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.

గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేశారు.  ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరి  ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడే కంటే మరింత బలమైన టీడీపీ నుంచి పోటీ చేస్తే ప్రయోజనం అధికంగా  ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆయనై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అందుకు జేడీ లక్ష్మీనారాయణ కూడా సుముఖంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.