ఈ భేటీ వెనుక ఏదో ప్లానుంది!

Publish Date:Jul 29, 2024

Advertisement

సోమవారం ఒక వార్త మీడియాలో గుప్పుమంది. అదే, వైఎస్ విజయమ్మ, జేసీ ప్రభాకరరెడ్డి భేటీ వార్త. జగన్‌కి బద్ధ శత్రువైన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ భేటీ అయ్యారంటే ఏదో ప్రత్యేకమైన రాజకీయ కారణం వుందన్న అభిప్రాయం అందర్లోనూ కలిగింది. చాలా కీలకమైన ఈ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించింది. ఈ వార్తలు చూసి వైసీపీ వర్గాల గుండెలు గుభేల్ అన్నాయి. ఎన్నికల జరిగినప్పుడు జగన్‌కి వ్యతిరేకంగా వీడియో మెసేజ్ రాష్ట్ర ప్రజలకు పంపిన విజయమ్మ, జగన్ ఓటమికి ఒక కారణంగా నిలిచారు. ఇప్పటికే జగన్ సర్వనాశనం అయిపో్యాడు.. ఇప్పుడు ఇంకా నాశనం చేయడానికి విజయమ్మ జేసీతో భేటీ అయిందేమోనన్న అభిప్రాయాలు వినిపించాయి. 

అయితే, ఆ తర్వాత జేసీ ప్రభాకరరెడ్డి నుంచి వివరణ వెలువడింది. ‘‘నేను విజయమ్మతో రాజకీయ కారణాలతో భేటీ కాలేదు. నేను హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి వెళ్ళాను. అక్కడ విజయమ్మ కూడా వున్నారని తెలిసింది. ఆమెతో నేను లాంజ్‌లో కూర్చుని మాట్లాడాను అంతే.. అంతకంటే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు’’ అనే సారాంశం వచ్చేలా ఆయన వివరణ ఇచ్చారు. దాంతో ఈ ఇష్యూ సర్దుమణిగింది. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నామే అని మీడియా అనుకుంటే, అనవసరంగ భయపడి  చచ్చాం అని వైసీపీ వర్గాలు అనుకున్నాయి.

కానీ, ఈ భేటీ అంత లైట్‌గా తీసుకోవాల్సిన భేటీ అని మాత్రం అనిపించడం లేదు. ఏదో  ఆస్పత్రిలో కాకతాళీయంగా కనిపించినప్పటికీ జగన్‌కి శత్రువు అయిన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ ఎందుకు భేటీ అవ్వాలి? అలా భేటీ అయితే అసలే అనుమానపు పక్షి అయిన జగన్, షర్మిల మీద పీకల వరకూ కోపంగా వున్న జగన్ ఈ భేటీని రాజకీయ కోణంలో ఆలోచిస్తాడేమోనని విజయమ్మ అనుకోలేదా? సరే, కాసేపు అసలు ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదనే అనుకుందాం. ఆయన నమస్కారం విజయమ్మగారూ అంటే, ఈవిడ నమస్తే రెడ్డిగారూ అంటే సరిపోతుంది కదా... అక్కడితో ఇష్యూ క్లోజ్ అయ్యేది కదా! మరి, వీళ్ళిద్దరి భేటీ ఫొటో తీసిందెవరు? దాన్ని మీడియాకి రిలీజ్ చేసిందెవరు? వాళ్ళ ప్రమేయం లేకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే ఫొటో తీశారా? కాబట్టి, ఈ భేటీలో ఏదో రాజకీయ ప్రాధాన్యం వుంది.. అదేంటో ఇప్పటికిప్పుడే తెలియకపోవచ్చుగానీ, అతి త్వరలోనే బయటపడే అవకాశాలు అయితే వున్నాయి!

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.