కమలనాథులకు ఆంటీ షాక్

Publish Date:Aug 17, 2022

Advertisement

సహజ నటి జయసుధ వెండి తెర మీద.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు.. వివిధ పాత్రల్లో అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు..   ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈ సహజ నటితో భేటీ అయి.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అయితే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతం తనకు లేదని ఈటలకు ఈ జ్యోతి సినిమా హీరోయిన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారని సమాచారం. అలాగే అదే సమయంలో ఈటల ఎదుట జయసుధ పలు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వాటిని అంగీకరిస్తే.. తాను పార్టీలో చేరేందుకు సిద్దమని ఈ సందర్భంగా ఈటలకు జయసుధ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ముందు ఉంచిన ఈ ప్రతిపాదనలు.. హస్తినలోని పెద్దలతో మాట్లాడి.. చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి.. తెలంగాణలో పాగా వేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ సినీ రంగ ప్రముఖులు, మేధావులపై కమలనాథులు గురి పెట్టారు. వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా.. కమల దళాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో వారితో రాష్ట్ర బీజేపీ నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు.  అలా జరిగిందే జయసుధతో భేటీ కూడా అనే ఓ చర్చ అయితే అటు రాజకీయ వర్గాల్లో .. ఇటు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

జయసుధ 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్  రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం అడ్డా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి తలసాని శ్రీనివాసయాదవ్‌ను జయసుధ ఓడించడంతో.. నాడు   సహాజ నటి పేరు ఉమ్మడి రాష్ట్రంలో  మారుమోగిపోయింది.

ఆమె ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆమె గుడ్ బై చెప్పారు. ఇక 2016లో విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆమె భర్త నితీన్ కపూర్‌తో కలిసి టీడీపీ కండువా కప్పుకొన్ను. ఆ తర్వాత ఆమె సైకిల్ పార్టీకి కూడా బై బై గుడ్ బై చెప్పేసి.. మళ్లీ 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోటస్ పాండ్‌లో వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత కాలంగా ఆమె స్తబ్దుగానే ఉంటున్నారు.

 అలాంటి సమయంలో బీజేపీ నేతల దృష్టి.. జయసుధపై పడిందని సమాచారం. ఆమెను పార్టీలోకి తీసుకుంటే.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఆమెకు నేటికి గట్టి  పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీకి తీసుకోవడం ద్వారా... టీఆర్ఎస్ స్పీడ్‌కు అడ్డుకట్ట వేయవచ్చుననే ఓ ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సహజ నటి ప్లస్ ఆంటీ సినిమా హీరోయిన్ జయసుధ.. అంటే ఈ ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలుసన్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఈ నేపథ్యంలో జయసుధను పార్టీలోకి తీసుకుంటే.. పార్టీకి మరింత అదనపు ఆకర్షణ ఏర్పడుతోందనే ఓ భావనలో మోదీ, అమిత్ షా ద్వయం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే.. తెలంగాణలో రాములమ్మ విజయశాంతి, తమిళనాడులో ఖుష్బు బీజేపీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో   సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకుంటే.. తెలంగాణలో కమలం పువ్వు వికసిస్తోందనే ఓ ఆలోచనలో కాషాయం దండు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని పలువురి కీలక నేతలు బీజేపీ గుటికి చేరుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కమలం కండువా కప్పుకొనున్నారు. ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలోని కీలక నేతలను.. కమలదళంలో చేర్చేందుకు సన్నాహాలు జెట్ స్పీడ్‌లో జోరందుకున్నట్లు సమాచారం.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.