జయలలిత శకం... ఏ సంవత్సరంలో ఏం జరిగింది?

Publish Date:Dec 5, 2016

Advertisement


1948: 24 ఫిబ్రవరిన కర్ణాటక రాష్ట్రపు  ఆనాటి మైసూర్ సంస్థానంలో మేల్ కొటే క్షేత్రంలో జన్మించారు.

1961: నటిగా సినిమా కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమా ఇంగ్లీష్ భాషలో నిర్మించిన ఎపిస్టల్!

1965: హీరోయిన్ గా మొదటి సినిమా సైన్ చేశారు...

1980: తన చివరి తమిళ సినిమా, నదియై తేడీ వందా కాదల్ లో నటించారు...

1982: ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కడలూర్ లో మొట్ట మొదటి బహిరంగ సభలో మాట్లాడారు!

1983:ఏఐఏడీఎంకే పార్టీ ప్రాపగాండా సెక్రెటరీగా నియమింపబడ్డారు. తిరుచందూర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు...

1984: ఎంజీఆర్ తో వైరం ముదిరి దూరం పెరిగింది. అనేక పార్టీ పదవుల్నుంచీ తొలగించబడ్డారు...

1987: ఎంజీ రామచంద్రన్ మరణంతో పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రాంచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు...

1988: జానకీ రాంచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 21రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది...

1989: డీఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జానకీ రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అదే సంవత్సరం డీఎంకే, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అంసెబ్లీ హాల్లో ఘర్షణ పడ్డారు. జయకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలుమోపుతానని శపథం చేసి చినిగిన చీరతో వెళ్లిపోయారు...

1991: ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కూటమి డీఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు...

1996: అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది. జయలలిత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. 48కేసులు ఆమె మీద, ఆమె స్నేహితురాలు శశికళ మీదా మోపబడ్డాయి...

2001: రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు. కాని, సుప్రీమ్ తీర్పుతో పదవి కోల్పోయారు. పన్నీర్ సెల్వమ్ అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు...

2003: ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి లభించటంతో ఆండిపట్టి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పురుచ్చి తలైవీ. మరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2006: డీఎంకే కూటమి చేతిలో ఓడిపోయిన జయలలిత 2011వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు...

2011: మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన జయ ప్రాణ స్నేహితురాలు శశికళకు దూరం అవుతూ వచ్చారు...

2014: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వంద కోట్ల ఫైన్, నాలుగేళ్ల జైలు శిక్షకి గురైన జయలలిత కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది...

2016: వరుసగా రెండోసారి, మొత్తంగా నాలుగోసారి జయలలిత ముఖ్యమంత్రిగా తమిళ ఓటర్ల చేత ఎన్నోకోబడ్డారు!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.