టీటీడీకి జవహర్‌రెడ్డి! కీలక పోస్టులన్ని వారికే.. ధర్మారెడ్డి దారెటు?

Publish Date:Oct 1, 2020

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పోస్టు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదలీ చేసిన జగన్ ప్రభుత్వం.. ప్రస్తుతం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పంపడంతో అదే శాఖ చూస్తున్న జవహర్‌రెడ్డిని టీటీడీకి బదిలీ చేయవచ్చంటున్నారు. జవహర్ రెడ్డి కూడా తనకు టీటీడీ ఈవో పోస్ట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారట. దీంతో సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి టీటీడీకి వెళ్లడం ఖాయమేననే తెలుస్తోంది. 

 

రాష్ట్రంలో  ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అదే క్రమంలోనే మరో రెడ్డికి కీలక పోస్టు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని హడావుడిగా ఏపీకి రప్పించారు. టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగా.. ఇప్పుడు ఈవో పోస్టును కూడా వారికే ఇవ్వడమేంటనే చర్చ భక్తుల నుంచి, ఏపీ ప్రజల నుంచి వస్తోంది. టీటీడీలో పూర్తిగా తమ సామాజిక వర్గమే ఉండేలా జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

మరోవైపు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి నియామకంపై చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. అదనపు ఈవో ధర్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. జవహర్ రెడ్డిని నియమించవద్దంటూ సీఎం జగన్ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సీఎం జగన్ టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని పంపిస్తే.. ధర్మారెడ్డి ఎక్కువ కాలం టీటీడీలో ఉండకపోవచ్చని, మూడు నాలుగు నెలల్లోనే వెళ్లిపోతారని టీటీడీ అధికారులే చెబుతున్నారు. 

 

జవహర్ రెడ్డి ఈవోగా వస్తే టీటీడీలో చాలా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. చైర్మెన్, అదనపు ఈవోల మధ్య విభేదాలు పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల టీటీడీ నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదమయ్యాయి. టీటీడీ డిక్లరేషన్ పై ఇటీవలే పెద్ద వివాదం జరిగింది. సీఎం జగన్ తీరుకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అయినా జవహర్ రెడ్డిని ఈవోగా జగన్ సర్కార్ నియమించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల మధ్య కోల్ట్ వార్ తో మరిన్ని సమస్యలు రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.