అంతా సజ్జల కనుసన్నలలోనే.. జత్వానీ కేసులో బలపడుతున్న అనుమానాలు!

Publish Date:Sep 18, 2024

Advertisement

సినీ నటి కాదాంబరి జత్వానీ కేసులో  ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు. జత్వానీని అరెస్టు చేయడం, ముంబై నుంచీ తీసుకురావడం వరకూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణాతాతా, విశాల్ గున్నీలు.. పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించిన తీరు దిగ్భ్రమ కొలుపుతోంది. విశాల్ గున్నీ మూడు పేజీల వాంగ్మూలంతో.. ఈ ఐపీఎస్ లను వెనకుండి నడిపించింది అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది సందేహాలకు అతీతంగా తేలిపోయింది. 

జత్వానీ కేసులో జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్  ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీ  వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలక ఆధారాలను గూగుల్ టేకౌట్ ద్వారా దర్యాప్తు అధికారులు సేకరించారు.    ఈ కేసులో జత్వానీ ఫిర్యాదు మేరకు నిందితుడు కుక్కల విద్యాసాగరరావు పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు సాంకేతికతను ఉపయోగించారు.   కుక్కల విద్యాసాగర్  సెల్‌ ఫోన్ నెంబర్‌ ఆధారంగా ఆయన ఆనుపానులు కనుగొనే ప్రయత్నంలో గూగుల్‌ టేకౌట్‌ను ఉపయోగించడంతో  మొత్తం గుట్టు బయటపడింది.

 జత్సానీని ముంబై నుంచి తీసుకువచ్చే రోజు అంటే ఫిబ్రవరి 2న విద్యాసాగర్‌ ముంబైలోనే విశాల్‌ గున్నీతోనే ఉన్నట్లు వెల్లడైంది.   తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ మేరరు  జెత్వానీ కదలికలు, అమె నివాసం వంటి విషయాలు తెలిసిన వ్యక్తిగా  విద్యాసాగర్‌ కూడా ముంబై  వెళ్లినట్లు తెలిసింది.  దీంతో పోలీసులు కుక్కల విద్యాసాగరరావు కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో  ఉన్నట్లు తెలిసింది.  ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే.. హోంమంత్రి అనిత.. జత్వానీ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదనీ,  ఈ కేసులో సలహాదారులు, సూత్రధారులను వదిలిపెట్టే ప్రశక్తే లేదని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అయితే.. ముగ్గురు ఐపీఎస్ లనూ సస్పెండ్ చేసిన తరువాత కూడా కేసు నమోదుకు జాప్యం ఎందుకన్న అసహనం తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు జనాలలో కూడా వ్యక్తం అవుతోంది.  అలాగే సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.   ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన దాష్టీకాలకు కాదంబరి జత్వానీ కేసు పరాకాష్టగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కాదంబరి  జత్వానీ విషయంలో ముగ్గురు ఐపీఎస్ లూ వ్యవహరించిన తీరు.. అత్యంత అమానవీయం, అమానుషం. వారి తీరు  ఐపిఎస్ చరిత్రకే మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో అరాచకాలను తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా మంది జత్వానిలు వెలుగు చూస్తాయని పరిశీలకులు అంటున్నారు. జత్వానీ కేసు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి లాండ్ మార్క్ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

By
en-us Political News

  
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.