మనసుకు హాయికలిగిస్తాయి మల్లెలు. మల్లెలు కురిసిన చల్లనివేళలో.. అంటూ సినీకవులు బహు చక్కని పాటతో సినీప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నారు. అదో అందం, అదో మాయ! మల్లెను ఆంగ్లంలో జాస్మిన్ అంటారు..ఈ జాస్మిన్ మరణాన్నే కాదు పొమ్మంది!
మనవాళ్లకే కాదు, ఎవరికయినా కేన్సర్ అంటేనే భయం. ఏదో తెలీని బాధ. అయ్యో పాపం అనిపిస్తుంది. మాంఛెస్టర్లో నివసిస్తున్న ఈ డేవిడ్ జాస్మిన్ వయసు ఇపుడు 51 సంవత్సరాలు. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ అని మూడేళ్ల క్రితం తేల్చారు. అంతే.. కుటుంబం, స్నేహితులు.. యావత్ మాంఛెస్టర్ మనసులో తెగ బాధ పడింది. మంచి బంధువుని, మంచి స్నేహితురాలినీ త్వరలో కోల్పోతున్నామని. యు.కె ఆస్పత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు ఇక ఆమె జీవితం రెండు మాసాలే అని తేల్చారు. ఆమె కోసం అంతా బావురుమన్నా రు. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ సంగతి చెప్పడానికి చాలా సంశయించారు. కానీ చెప్పక తప్పలేదు. ఆమె కోసం ఆస్పత్రి చుట్టూ తిరిగినవారు బాధపడని క్షణం లేదు. అయ్యో ఇన్నాళ్ల స్నేహం ఇంక రెండు నెలల్లో ముగిసిపోతుందా? మరణానికి కరుణ లేదు సుమా అనుకున్నారంతా.
కానీ విచిత్రాలు లోకంలో సంభవిస్తుంటాయి. చాలామంది నమ్మరు. కొన్ని సంఘటనలు వారినీ నమ్మిస్తు న్నాయి. ఇదుగో జాస్మిన్ కేసు లా. మాంఛెస్టర్లోని జాతీయ ఆరోగ్య సేవా సంస్థ ఆస్పత్రివారు జాస్మిన్ను మళ్లీ మళ్లీ పరీక్షించారు. ఎలాగైనా ఆమె చక్కగా నవ్వుతూండాలని కోరుకున్నారు. ఆ ప్రార్ధన ఎవరో విన్నా రు. అంతే వారి ప్రయత్నాలు ఫలించాయి. జాస్మిన్కు బ్రెస్ట్ కాన్సర్ లక్షణాలేవీ లేవని తేల్చారు.
ఒక్కసారిగా దిగులు గుహలోంచి ఆనందపు వెలుగు కనపడింది. జాస్మిన్ చిరునవ్వింది. మాంఛెస్టర్ ప్రజలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఆమె సెస్టెంబర్లో తన 25వ వివాహ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఎదురుచూస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jasmin-win-over-cancer-25-139272.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.