జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో హ‌త్య‌ ..ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాల్పులు

Publish Date:Jul 8, 2022

Advertisement

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే మృతి చెందారు. ఆయ‌న‌పై శుక్ర‌వారం ఒక వ్య‌క్తి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపాడు. ప‌శ్చిమ జ‌పాన్ నారా ప‌ట్ట‌ణంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో వుండ‌గానే హ‌ఠాత్తుగా ఒక‌వ్య‌క్తి షింజోపై కాల్పులు జ‌రిపిన‌ట్టు జ‌పాన్ అధికారులు తెలిపారు. తుపాకుల దాడుల సంఘ‌ట‌న‌లు క‌నీవినీ ఎరుగ‌ని దేశంలో ఈ సంఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింది.  శుక్ర‌వారం ఉద‌యం 11.30 స‌మ‌యంలో షింజో ఒక వీధిలో ఎన్నిక‌ల  ప్ర‌చార ప్ర‌సంగం చేస్తుండ‌గా  ఆయ‌న వెనుక నుంచి  ఒక వ్య‌క్తి షాట్‌గ‌న్‌తో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో షింజో అబే ఛాతిలో బుల్లెట్ త‌గిలింద‌ని తెలిసింది. అబే వెంట‌నే కుప్ప‌కూలిపోయారు. 

ర‌క్తం మ‌డుగులోని అబేను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా వుంద ని, కార్డియో ప‌ల్మ‌న‌రీ అరెస్టు స్థితిలో వున్నార‌ని టోక్యో మాజీ గ‌వ ర్న‌ర్ చెప్పారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో  41 ఏళ్ల అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అడ్డు కుని అదుపులోకి తీసుకున్నారు  అబే పై కాల్పు లు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.శక్తివంతమైన రాజకీ య కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే 1993లో జపాన్ దిగువ సభకు ఎన్నికయ్యారు. అబే తొలి సారిగా 2006 లో జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీవిరమణ చేశారు.

ప్ర‌ధాని ఫుమియో కిషిదా, ఇత‌ర మంత్రిమండ‌లి స‌భ్యులు త‌మ ప్ర‌చారం నిలిపివేసి వెంట‌నే టోక్యో వెళ్లా రు. ఎల్‌డిపి సుల‌భంగా విజ‌యం సాధించాల్సిన స‌మ‌యంలో ఈ కాల్పుల సంఘ‌ట‌న భారీ ప్ర‌భావం చూపవ‌చ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందేందుకు ఆగస్టు 2020లో పదవీవిరమణ చేశారు. అయినప్పటికీ, అతను మరింత రక్షణ వ్యయం కోసం రాజకీయం గా ప్రభావవంతంగా ఉన్నాడు మరియు తైవాన్‌పై ఏదైనా దాడి చేస్తే దాని ఆర్థిక వ్యవస్థకు వినాశకరమైన దని చైనాను హెచ్చరించాడు. 

జపాన్ ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో కొన్ని కఠినమైన తుపాకీ చట్టాలను కలిగిన‌ దేశం,  కాల్పులు  చాలా అరుదు. కానీ రాజకీయ హింస ఇప్పటికీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది: 2007లో, నాగసాకి మేయర్ ఇట్చో ఇటో  మ‌ర‌ణించ‌డానికి ముందు వ్యవస్థీకృత క్రైమ్ గ్యాంగ్ సభ్యునిచే  రెండుసార్లు తుపాకీ దాడు ల‌ను త‌ప్పించుకున్నారు. 

ఆయ‌న  త‌న  పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ ప‌రిస్థితులు  దశాబ్దాలుగా అత్యంత ప్రతికూలం గా ఉంది. ప్రతి ద్రవ్యోల్బణం చక్రం నుండి జపాన్ తప్పించుకోవడానికి అబే కృషి అన‌న్య‌సామాప్యం అం టారు అక్క‌డి ఆర్ధిక‌వేత్త‌లు.  దేశం ఏకైక సైనిక కూటమిని ప్రశ్నించే ట్రంప్ పరిపాలనను భరిస్తూనే తన అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.