జనవాణి ఈ వారమూ రద్దు..? పవన్ కల్యాణ్ ఎక్కడ?

Publish Date:Jul 30, 2022

Advertisement

జనసేనాని అధినేత రాజకీయ ప్రస్థానం ముందుకూ కదలడం లేదు.. అలాగని వెనక్కూ వెళ్లడం లేదు. ఏ కార్యక్రమమైనా ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తరువాత అర్ధంతరంగా మానేయడం. గతంలోనూ జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతుందా అన్న అనుమానాలు జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమౌతుంది. ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటన అనంతరం అనారోగ్యం కారణంగా జనసేనాని విశ్రాంతి తీసుకుంటున్నారు.

జనసేన వర్గాలే ఈ విషయాన్ని చెప్పి గత ఆదివారం జరగాల్సిన జనవాణి కార్యక్రమం రద్దైనట్లు ప్రకటించారు.  అప్పుడే తదుపరి జనవాణి జూలై 31వ తేదీన విశాఖలో నిర్వహిస్తామనీ అప్పట్లోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయతే ఆ తరువాత ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ వెల్లడించలేదు. అంతే కాదు ఈ వారం రోజులలో ఎక్కడా పవన్ కల్యాణ్ కనిపించింది లేదు. మాట్లాడింది లేదు.

కాపు నేస్తం కార్యక్రమంలో జనసేనానిపై చేసిన విమర్శలపై జనసేన శ్రేణులు స్పందించాయి కానీ పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం కూడా జనవాణి కార్యక్రమం రద్దైనట్లేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినంత ఆనారోగ్యం ఏమిటన్నది అంతుపట్టకుండా ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎలాంటి సమాచారం లేకుండా రద్దవ్వడం పట్ల జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవవుతోంది.  రాష్ట్రం ఒక వైపు భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైపోతుంటే బాధితులను పరామర్శించడానికి కూడా పవన్ కల్యాణ్ రాకపోవడం రాజకీయంగా పార్టీకి నష్టం అన్న భావన వ్యక్తం అవుతోంది.

అత్యంత కీలకమైన సమయంలో పవన్ కల్యాణ్ మౌనం కార్యకర్తలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కష్ట సమయంలో బాధితులకు అండగా ఉన్నప్పుడే నాయకుడి పట్ల జనంలో విశ్వాసం కలుగుతుంది. అలా జనంలో విశ్వాసాన్ని చూరగొనే అవకాశాన్ని పనవ్ జారవిడిచారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.