గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన హ్యాగ్ టాగ్ డిజిటల్ క్యాంపెయిన్
Publish Date:Jul 15, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌తో.. ఏపీలోని రోడ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తున్నారు జనసేన శ్రేణులు. శుక్రవారం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన శ్రీణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆందళనలు సైతం నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద జనసేన శ్రేణులు ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకుకోవడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే ధర్నా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు..
http://www.teluguone.com/news/content/janasena-digital-campaogn-good-morning-cm-sir-39-139834.html





