పవన్ కళ్యాణ్ పై జన సైనికుల అగ్రహం.. ఎందుకో తెలుసా ?

Publish Date:Jun 25, 2022

Advertisement

రాజకీయాల్లో ఉండాలంటే రాజకీయం తెలియాలి ...  అంటే, అయినా ఇదేం  స్టేట్మెంట్, రాజకీయాలు తెలియని వారు రాజకీయాల్లో ఎందుకుంటారు, ఎలా ఉంటారు .. హౌ .. అని మనం అనుకోవచ్చును కానీ, రాజకీయాలు అంటే  కేవలం  జెండాలు, ఎజెండాలు మాత్రమే కాదు. ఇంకా చాలా కళలు తెలిస్తేనే కానీ, రాజకీయాల్లో రాణించ లేరని ఆధునిక రాజకీయ పండితులు ఘోషిస్తున్నారు. ప్రైవేటుగా పాఠాలు కూడా చెపుతున్నారు.  అప్పుడెప్పుడో సత్యకాలంలో గిరీశం మాస్టారు, ‘ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు, పోలిటిషియన్ కాలేరు’  అని ఓ సింపుల్ చిట్కా చెప్పి వదిలేశారు.  కానీ , ఇప్పుడు అదొక్కటే సరిపోదని ఆధునిక గిరీశం సార్లు చెపుతున్నారు. ఇప్పడు మనం ఆనాటి సత్యకాలంలో లేమని గుర్తు చేస్తున్నారు. సో ..ఈ రోజు రాజకీయాలలో రాణించాలంటే ... వాళ్ళు  సినిమా స్టార్లు అయినా సరే, జస్ట్ గ్లామర్ ఉంటే సరిపోదు, గ్రామరు కూడా తెలిసుండాలి. దానితో పాటుగా,నోరుండాలి,  ఆ నోట్లో  ఫినాయిల్ సీసాలు కాదు పీపాలు పోసి కడిగినా పోనంత బూతుండాలి..అందులో మీ ప్రత్యర్ధి, వైసేపీ బూతు భాషకు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పడు  మీకు బూతు  బాష బాగా వచ్చుండాలి.. అంటూ ఆయనకు అయన అభిమానులు, అనుచరులు  పాఠాలు చేపితున్నారు. ..ట. 
ఇంతకీ విషయంవిషయం ఏమంటే, ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా,  బూతు పాండిత్యంలో మాత్రం వైసీపీదే ఫస్ట్ ప్లేస్. ఆడ మగ తేడా లేకుండా, బ్రహ్మాండగా బూతులు మాట్లాడగల నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రుల కొరత  లేని పార్టీ, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద  ఏదైనా ఉందంటే, అది వైసీపే ఒక్కటే, ఈవిషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఈ మధ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా వైసీపీతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అయినా, వైసీపీ స్థాయికి ఇంకా చేరలేదు.

అదలా ఉంటే, బూతులు నేర్చుకోవయ్యా.. బాబు .. అంటూ పవన్ కళ్యాన్ అభిమానులు ఆయన వెంట పడుతున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్  ఈ విషయంలో చాలా చాలా వెనకబడి పోయారని, పొలిటికల్ గురువులు కూడా, పవన్ అప్డేట్ కావాలనే అంటున్నారు. 

ఒకప్పదు ఏమో కానీ, ఈ రోజు రాజకీయ నాయకులు చాలావరకు సంస్కారహీనంగా మాట్లాడడమే రాజకీయ సంస్కారం అనుకుంటున్నారు. దిగజారి దూషణలకు దిగాజరుతున్నారు. ముఖ్యంగా వైసేపీ నాయకులు అయితే, ప్రత్యర్ధి  పార్టీల నాయకులనే, కాదు, నాయకుల కుటుంబ సభ్యులను కూడా అసభ్యంగా దూషించి, ఆనందం పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడే, అసెంబ్లీలో కళ్ళ నీళ్ళు పెట్టుకునే స్థితి వచ్చిందంటే, వైసీపీ ఏ స్థాయికి దిగజారిందో వేరే  చెప్పనక్కర లేదు.

అలాగే, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడాడా వైసేపీ నాయకులు దిగజారుడు భాషలో దుర్భాషలాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం, వైసీపీ నాయకులకు దీటుగా, వారికి అరమయ్యే భాషలో సమాధానం ఇవ్వడం లేదనేది, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన పై చేస్తున్న అభియోగం. నువు  తమలపాకుతో ఒకటంటే..నే తలుపు చెక్కతో రెండంటా’ అనేలా రాజకీయ భాష ఉండాలని లేదంటే, కష్టమని  పవన్ పై కాస్తంత కోపగించుకుంటున్నారు.

జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దారుణమైన భాషతో విరుచుకుపడ్డారు. అవి ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కేసులు పెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బాలినేని గారూ మీ అనుచరులకు పద్దతులు నేర్పండి అంటూ ప్రకటన జారీ చేశారు. ఇదే జనసైనికులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.అందుకే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బాతులు బాగా బట్టి పట్టాలని  అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.