ఎవరికి వారే యమునా తీరే.. జనగామ కాంగ్రెస్ నేతల తీరే వేరయా

Publish Date:Jun 20, 2022

Advertisement

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధిక రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఈ రాజకీయ పార్టీని అభివర్ణిస్తుంటారు. సుదీర్ఘ కాలం పాటు దేశంలో తిరుగులేని అధికారం చెలాయించిన ఈ పార్టీ ఇటీవలి కాలంలో బాగా బలహీనపడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ కు కర్ణుడికి సహజ కవచ కుండలాల్లా.. పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాలు ఎల్లవేళలా అంటిపెట్టుకునే ఉంటాయి. పార్టీకి విజయావకాశాలున్న చోట కూడా పార్టీలోని విభేదాలు ఆ అవకాశాలకు గండికొట్టే పరిస్థితులు ఎదురౌతున్నా నేతలకు పెద్ద పట్టింపు ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంగా ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటైన పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు క్యాడర్ లో కలవరం  సృష్టిస్తున్నాయి. అయోమయానికి కారణమౌతున్నాయి. ఈ పరిస్థితి పలు నియోజకవర్గాలలో నెలకొని ఉంది. అయితే జనగామ జిల్లాలో మాత్రం ఈ వర్గ పోరు ఒకింత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిలు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తుండటం.. వేర్వేరు కుంపట్లు రాజేసుకుని పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వురుగా నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఇటీవల వరంగల్ లో జరిగిన రాహుల్ సభ అద్బుత విజయం సాధించడం, ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ప్రతి నియోజకవర్గంలోని గడపగడపచూ చేర్చడంలో కాంగ్రెస్ నాయకులు ఒక నిర్దుష్ట పథకంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో మున్నెన్నడూ కనిపించని ఐక్యతా కనిపిస్తోందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణపేరుతో వేధిస్తున్నదంటూ.. దేశ వ్యాప్ంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపు నిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు.

అయితే జనగామ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఏమీ మారలేదు. ఇక్కడ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్యా సయోధ్య అన్నది ఎండమావిలాగే తయారైంది. ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నవారే. దీంతో ఇద్దరూ కూడా వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీలను జనంలోకి తీసుకెళ్లే కార్యక్ర మంలో కూడా ఎవరి దారి వారిదేగా ఉంది. ఎవరికి వారు నియోజకవర్గ గ్రామాలలో పర్యటనలు నిర్వహిస్తున్నారు.

ఎవరి క్యాడర్ వారిదే అన్నట్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థతి.  కోమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడవటూరు సిద్దేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి రచ్చబండ ప్రారంభిస్తే,  పొన్నాల లక్ష్మయ్య కొమురవెల్లి మల్లిఖార్జున దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి రచ్చబండ చేపట్టారు. రచ్చబండ కార్యక్రమాన్ని సైతం జనగామ నియోజకవర్గంలోని చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు మండలాల్లో ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహించడంతో పార్టీలో అయోమయం నెలకొంది.  ప్రజలు సైతం ఇరువురునేతలూ కాంగ్రెస్ లోనే ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ గందరగోళపడుతున్నారు. ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వంఎలా సరిదిద్దుతుందా అని పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది.

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.