కాశ్మీర్ ఎన్నికలు.. కత్తిమీద సామే!

Publish Date:Sep 4, 2024

Advertisement

జమ్మూ కాశ్మీర్ అనగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం గుర్తుకు వస్తాయి. అటువంటి రాష్ట్రంలో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఎన్నికల ఎర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పదేళ్ల తరువాత తొలి సారిగా జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది.  చివరిసారిగా ప్రజాలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో తొలి దశ నామినేషన్ల పర్వానికి చివరి రోజున దాదాపు 280 నామినేషన్లు దాఖలయ్యాయి.  ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న, తుది దశ పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. తొలి దశ ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.  అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండడం, ఆయా అభ్యర్థులనామినేషన్‌ పత్రాలను దాఖలు కార్యక్రమానికి వేల సంఖ్యలో  మద్దతు దారులు తరలి రావడాన్ని బట్టి ఎన్నికల పట్ల ప్రజలు ఎంత ఆత్రతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది అవగతమౌతుంది.  

మహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పి.డి.పి) ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించే వరకూ, అంటే 2018 వరకూ ఇక్కడ ప్రజా ప్రభుత్వం కొనసాగింది. కాగా, 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా? కల్పిస్తే ఎప్పుడు అన్న విషయాలలో క్లారిటీ లేదు.  

ఇప్పుడు ఎన్నికలు  కూడా సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నెల  30లోగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు గడువును నిర్ణయించడంతో అనివార్యంగా ఎన్నికల నిర్వహణకు సీఈసీ సిద్ధమైంది.  వాస్తవానికి  2019 ఆగస్టు నుంచి ఈ ప్రాంతానికి అధికారాలు కుదించేశారు. ఇప్పుడు ఇది  కేంద్రపాలిత ప్రాంతం అయినందువల్ల అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఏది ఏమైనా, కాశ్మీర్‌లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలైన పి.డి.పి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌.సి)లు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్‌ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ప్రారంభించిన డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏ పార్టీ, ఏ సంస్థా ఎన్నికల బహిష్కరణకు పిలుపు నివ్వలేదు.

ఇక ఇండియా కూటమిలో భాగస్వాములైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌  సీట్ల పంపకం విషయంలో ఒప్పందానికి వచ్చాయి. ఇక బీజేపీ, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఒంటరిగానే రంగంలోకి దిగాయి.  మొత్తం మీద రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  
అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి కత్తిమీద సామే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ  ఇక్కడ  ఉగ్రవాదం, వేర్పాటువాదం సీరియస్ సమస్యలుగానే ఉన్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఇప్పటికీ  పాకిస్థాన్‌  అనుకూల వైఖరినే అవలంబిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ  జమ్మూ, కాశ్మీర్‌ లను అభివృద్ధి మీద పెద్దగా శ్రద్ధ లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  రాజకీయలబ్ధి కోసమే ఇండియా కూటమిలో చేరాయని ఆ పార్టీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కాశ్మీర్‌ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నది బీజేపీయే అంటూ ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.