పహల్గామ్ ఉగ్రదాడి కేసు..ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు

Publish Date:Apr 27, 2025

Advertisement

 

 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్‌లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సుందరమైన పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

సంఘటన జరిగిన తీరును, ఉగ్రవాదుల కదలికలను కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి, వారి మతాన్ని అడిగి తెలుసుకుని, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారని తెలిసింది. మృతుల్లో 25 మంది హిందూ పురుషులు ఉన్నారు. ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో లభించే ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ దారుణ మారణకాండ వెనుక ఉన్న ఉగ్ర కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. భారత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహ్మద్ (జేఈఎం) సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి.

By
en-us Political News

  
పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా? గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా? అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా? అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది.
అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు.
కడప మహానాడు బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ స్పృహ తప్పి పడిపోయారు.అపస్మారక స్థితిలో ఉన్న జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించారు.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా, కోరాపూట్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు.
కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది.
ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో కూటమి సర్కారు లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కవిత హాట్ టాపిక్ గా మారారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా తండ్రి కేసీఆర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపుతే ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన క్షణం నుంచీ తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. అంతకు ముందు నుంచీ కూడా ఆమె మాటలు, తీరు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తూనే ఉంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే అని పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని షాకింగ్ కామెంట్స్ అన్నారు.
మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్‌ కో బ్యాచ్‌ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
బీఆర్ఎస్ అధినేత కుటుంబంలో అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు.
ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం, హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం.. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.