కాంగ్రెస్ సీనియర్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.!
Publish Date:Aug 20, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress, TPCC Disciplinary Committee
http://www.teluguone.com/news/content/jakkidi-prabhakar-reddy-25-229327.html





