Publish Date:Jul 27, 2022
తూర్పుగోదావరిజిల్ల రాజానగరం యం.ఎల్.ఎ జక్కంపూడి రాజా నిన్న జనసేన,వీర మహిళా నాయకులతో మాట్లాడిన మటల తీరు ఇప్పుడు చర్చనీయంశం అయింది. వరద ప్రభావిత ప్రాంతలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ని కలిసి వరదభాదితులకి పదివేల రూపాయల చొప్పున సహాయం అందించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు జనసేన నిర్ణయించింది. అయితే వారెవరూ జగన్ ను కలవకుండా పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నారు. జనసేన నేతలు కొందరికి ‘ముందస్తు’ హౌస్ అరెస్టులు చేశారు
ఐతే మిలిగిన నాయకులూ,జనసేన వీర మహిళలు ముఖ్యమంత్రి వెళ్ళాకా గంటి పెదపూడి లో జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేసారు. వరద భాదితులని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసన వ్యక్తం చేసారు. తన వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడాన్ని సహించలేకపోయిన జక్కంపూడి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యంగా మాట్లాడారని మహిళలు ఆరోపిస్తున్నారు.
జక్కంపూడి భాష మార్చుకోవాలని జనసేన వీరమహిళలు హెచ్చరించారు. నిరసనను ఉధృతం చేశారు. వీరమహిలలని అదుపులోకి తీసుకున్నారు. అయితే జక్కంపూడి భాష పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే జక్కంపూడి ఈ విధమైన దుడుకు వ్యవహారం ఇదే మొదటి సారి కాదని అంటున్నారు. పోలవరంలో ప్రభుత్వ ఇంజనీర్ పై కూడా చెయ్య చేసుకున్న సంఘటనను గుర్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jakkampudi-uses-foul-laungage-on-janasena-women-25-140643.html
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!