తొండం లేకుండా పూజలు అందుకునే వినాయకుడి గురించి తెలుసా? లెటర్ లు రాసి మరీ కోరికలు కోరుతారండోయ్!

Publish Date:Aug 28, 2025

Advertisement


భారతదేశంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.  ఈ వేడుకలు దేశం యావత్తు ఎంతో గొప్పగా, మరెంతో భక్తిగా జరుపుకుంటారు. ప్రతి పూజలోనూ తొలి పూజలు అందుకునే వినాయకుడిని తొమ్మిది రోజులు కొలువుంచి ఘనంగా పూజ చేయడం,  ఆ తరువాత ఎంతో గొప్పగా ఊరేగింపు చేసి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం చేస్తారు. అయితే దేశంలో చాలా చోట్ల పండుగలు, దేవుళ్ల విషయంలో చాలా వింతలు       చూస్తుంటాం. అలాంటి వింత ఒకటి ఇప్పుడు తెలుసుకుంటే..

తొండం లేని వినాయకుడు..

దేశ వ్యాప్తంగా గణేశుడి ఆలయాలు వందలాది ఉన్నాయి.  ఆ ఆలయాలలో కొన్ని చాలా ప్రత్యేకం.  వాటిలో ఒకటి రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న గర్ గణేష్ ఆలయం. గర్ గణేష్ ఆలయం  అతి పెద్ద విశేషం ఇక్కడ గణేశుడికి తొండం ఉండదు.   అంటే ఇక్కడ గణేషుడు బాల రూపంలో ఉంటాడట. ఇక్కడ వినాయకుడికి తొండం ఉండదు. వినాయకుడు ఇక్కడ పురుషాకృతి రూపంలో కూర్చుని ఉన్నాడని నమ్ముతారు. .

ఆలయ చరిత్ర..

18వ శతాబ్దంలో మహారాజా సవాయి జై సింగ్ II ఈ ఘర్ గణేష్ మందిరాన్ని నిర్మించాడు. జైపూర్‌ను స్థాపించే ముందు ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ ఆలయానికి పునాది వేశారని చెబుతారు. సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో కనిపించే విధంగా ఆయన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రత్యేకమైన ప్రణాళిక నుండి మహారాజా భక్తి,  నిర్మాణ దృష్టిని అంచనా వేయవచ్చు. బారి చౌపాడ్‌లో ఉన్న ధ్వజాధీష్ గణేష్ మందిరం ఘర్ గణేష్ మందిరంతో కనెక్ట్ చేసి  ఉంది, దీనిని దానిలో భాగంగా భావిస్తారు.

కష్టాల ఏకరువు..

ఘన్ గణేష్ ఆలయం చాలా చారిత్రకమైనదే కాకుండా పూజా పద్ధతి కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ గణేశుడి విగ్రహం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఎలుకలు ఉంటాయి.   భక్తులు తమ సమస్యలను,  కోరికలను ఈ ఎలుకల చెవులలో చెబుతారట. ఈ ఎలుకలు భక్తులు చెప్పుకునే బాధు, కోరికలను  నేరుగా వినాకుడికి  తెలియజేస్తాయని  వినాయకుడు  వారి కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు.

ఉత్తరంతో వినతులు..

ఘర్ గణేష్ మందిరంలో   అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..  భక్తులు తమ కోరికలను లేఖలు లేదా ఆహ్వాన పత్రాల రూపంలో స్వామికి సమర్పిస్తారు.  మొదట్లో  పెళ్లి కావాలని, బిడ్డలు కావాలని, ఉద్యోగ కావాలని ఇట్లా ఏదైనా కోరికలు ఉంటే వాటి కోసం  ప్రతిరోజూ వందలాది లేఖలు  స్వామి వారికి వచ్చేవి.  వాటిని చదివి భగవంతుని పాదాల వద్ద ఉంచుతారట. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.  వినాయకుడు భక్తుల గోడు వెంటాడని తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

మెట్ల దారి..

తిరుమల వెంకన్నను దర్మించుకోవడానికి చాలామంది మెట్ల దారి గుండా నడిచి కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుందని, స్వామి అనుగ్రహానికి దగ్గర చేస్తుందని చెబుతారు. అయితే ఇదే విధంగా ఘర్ గణేషుడి ఆలయానికి కూడా ఇట్లాగే వెళ్లవచ్చు. కాకపోతే ఇక్కడ మెట్ల సంఖ్య 365.  ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కడం కొంచెం అలసిపోయేలా ఉంటుంది, కానీ ఆలయానికి చేరుకున్న వెంటనే లభించే ప్రశాంతత అన్ని అలసటలను దూరం చేస్తుంది. ఇక్కడి నుండి, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో, మొత్తం జైపూర్ నగరం వ్యూ అద్భుతంగా కనిపిస్తుందని చెబుతారు.  ఇదీ ఘర్ గణేషుడి ఆలయ ప్రత్యేకత.


                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.