Publish Date:Jul 31, 2013
తెలంగాణ ప్రక్రియ ఐదారు నెలలలో పూర్తి అవుతుందని చెప్పగలనని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయం వల్ల ఒక ప్రాంతం ఓటమి, ఒక ప్రాంతం విజయంగా బావించరాదని అన్నారు. రెండో ప్రాంతంవారి అనుమానాలు హైదరాబాద్ , నదీ జలాల గురించి ఉన్నాయని అన్నారు.అందువల్లనే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారని, అలాగే నదీ జలాలపై చట్టబద్దమైన ఏర్పాట్లు ఉంటాయని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaipal-reddy-telangana-39-24805.html
పుష్ప 2 సినిమా టికెట్ ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన రిలీజ్ కు తెలంగాణ హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కమల దళం రాను రానూ ఆ పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసి రాజకయ ప్రత్యర్థులను కబలించేయడం లక్ష్యంగా పెట్టుకుందా? రాష్ట్రాలలో అధికారం కోసం ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, అమలు చేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది.
2014 ఎన్నికలకు కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఇచ్చిన ఆ పార్టీ ఆ తరువాత సాగించిన ప్రస్థానాన్ని చూస్తుంటే దేశం మొత్తాన్ని కాషాయంతో నింపేయాలనీ, బీజేపీ జెండా యావద్దేశాన్ని కమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఏటూరు నాగారం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ ఏటూరు నాగారం సమీపంలోని చల్పాక ఆటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. మావోయిస్టుల ఎన్ కౌంటర్ వెనక కుట్ర జరిగిందని, మావో యిస్టుల ఆహారంపై విషప్రయోగం జరిగిందని ఆ పిటిషన్ లో పేర్కిన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినే నేత జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసులు గత కొన్నేళ్లుగా విచారణకు నోచుకోవడం లేదు. గడిచిన ఐదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్.. విచారణలకు సైతం ఎగనామం పెట్టేశారు. సీఎం హోదాలో తనకున్న వెసులుబాటును వినియోగించుకుని కేసుల విచారణ నత్తనడకతో పోటీ పడేలా చేసుకోగలిగారు. అయితే తాజాగా జగన్ జైలుకు వెళ్లాల్సిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నాయకుడు ఆళ్ల నాని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. వైసీపీలో చాలా కాలం కొనసాగినప్పటికీ ఆళ్ల నాని ఎన్నడూ తెలుగుదేశం నేతలపై నోరు పారేసుకున్నది లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి విధేయుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని ఆ విధేయత కారణంగానే వైఎస్ మరణం తరువాత జగన్ వెంట నడిచారు.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపైడ చంద్రశేఖర్ అవినీతి గట్టు రట్టు చేయడంతో పాటు, ఆయన ఇక బయటపడలేని విధంగా చక్రబంధంలో ఇరికించేస్తున్నారా? అంటే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీ పరిశ్రమ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసంది.
రేషన్ బియ్యం దందాకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టబోతోందా.. బియ్యం మాఫియా వెనుక ఉన్న సూత్రదారుల లెక్క తేల్చడమే కూటమి పెద్దల టార్గెటా.. కూకటివేళ్లతో బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని పెకలించి వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయా.. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీలో జరిగిన చర్చను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 3) శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణలో ఈ ప్రమాదం సంభవించింది. కోర్ట్ 11, 12 మధ్య ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. . అగ్ని మాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను పెద్ద పులి వణికిస్తోంది. గత రెండు రోజులుగా ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి , సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఫెంగల్ తుఫాను బలహీనపడింది. అయినప్పటికీ దీని ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఎపిలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కులాంతర వివాహం ఓ మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. స్వంత తమ్ముడే హత్యకు పాల్పడటం సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది.