ఢిల్లీ ఫలితాలతో జైలు సెంటిమెంట్ హుష్ కాకీ... కేటీఆర్ ఇప్పుడేం చేస్తారో?

Publish Date:Feb 10, 2025

Advertisement

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా రాజకీయ పార్టీల భ్రమలను పటాపంచలు చేసేశాయి. పలువురు నేతల ఆశలను అడియాశలు చేసేశాయి. మరీ ముఖ్యంగా సెంటిమెంటు పండితే చాలు అధికారం గ్యారంటీ అంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలకూ, నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. 
తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మధ్య ఎన్నికలలో అధికారం కోల్పోయిన పార్టీలకు గట్టి ఝలక్ ఇచ్చాయి. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ.. ఆ రోజు నుంచీ కూడా ఒక సెంటిమెంటును బలంగా నమ్ముకుని మళ్లీ అధికారంలోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.

ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని వైసీపీ కూడా సెంటిమెంటు పండిస్తే చాలు మళ్లీ అధికారపగ్గాలు మావే అన్న ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రెండు పార్టీలకూ కూడా గట్టి ఝలక్ ఇచ్చాయి. జైలు కెళ్లొస్తేనే, సానుభూతి కోసం వెంపర్లాడితేనో జనం ఓట్లు వేయరని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢంకా బజాయించి మరీ చెప్పాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలలో  జైలుకి వెళ్లొస్తే ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ అన్న సెంటిమెంట్ ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు..

వైసీపీ అధినేత జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇలా వీరంతా అరెస్ట్‌ అయిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. దీంతో అధికారానికి అరెస్టు ఒక అడ్డదారి అన్న భ్రమల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, పార్టీలూ పడిపోయాయి.  తెలంగాణ విషయానికి వస్తే.. ఎఫ్-1 రేసింగ్ కేసులో దమ్ముంటే తనని అరెస్ట్‌ చేసి జైలుకి పంపాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పదేపదే  చేసిన సవాలు వెనుక ఉన్న కారణం ఇదే.  అంతే కాకుండా ఈ కేసులో తన అరెస్టు ఖాయమనీ, జైలులో యోగా చేసి మరింత ఫిట్ గా తయరై వచ్చి పాదయాత్ర చేస్తాననీ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి పుణ్యం కట్టుకోండని అధికార కాంగ్రెస్ పార్టీని బతిమలాడుకుంటున్నారా అన్నట్లుగా వ్యవహరించారు.  అయితే జైలు అధికారం సెంటిమెంటుకు రేవంత్ ఏమీ అతీతుడు కాదు కనుక.. కేటీఆర్ అరెస్టు విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న తొందర తనకేం లేదని కుండబద్దలు కొట్టేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ వెనకడుగు వేశారు. కేటీఆర్‌ని అరెస్ట్‌ కోసం పకడ్బందీగా వ్యూహాలు పన్నారనీ ఇహనో ఇప్పుడో  అయన కటకటాల పాలవ్వడం ఖాయన్నట్లుగా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అరెస్టు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిందో ఏమో కేటీఆర్ అరెస్టు విషయంలో తనకు ఎటువంటి తొందరా లేదని వెనకడుగు వేశారు.  

అయితే కేటీఆర్ కూడా నిన్నమొన్నటి వరకూ కేటీఆర్ ఎలాగైనా సరే అరెస్టవ్వాలన్న ప్రయత్నాలూ చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి కేటీఆర్ అరెస్టు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ఆ అరెస్టును తప్పించుకోవడం కోసం కేటీఆర్, బీఆర్ఎస్ లు ప్రయత్నాలు ప్రారంభిస్తాయని సెటైర్లు వేస్తున్నారు. జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులు అయిపోరనీ, జైలు కెళ్లడం అన్నది అధికారానికి అడ్డదారి ఎంత మాత్రం కాదనీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేసేశాయని అంటున్నారు.  ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా మద్యం కుంభకోణం కేసులో  జైలుకు వెళ్లి వచ్చారు.  అయినా అధికారం కోల్పోయారు.  దీంతో నిన్న మొన్నటి వరకూ జైలుకెల్లాలని ఉబటాటపడిన కేటీఆర్ ఇప్పుడు జైలు మాటెత్తితేనే ఉలిక్కిపడుతున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.