Publish Date:Jun 24, 2025
మన పాలకొల్లు అమ్మాయి ఏకంగా అంతరిక్షయానం చేయనుంది. ఇప్పటి వరకూ భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్షయానానికి ఎంపికైన చరిత్ర లేదు. అయితే అంతరిక్షయానానికి ఎంపికై మన పాలకొల్లు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్లో జాహ్నవి దంగేటి ఉత్తీర్ణురాలై ఈ స్పేస్ మిషన్ కి అర్హత సాధించింది. ఈ మేరకు జాహ్నవి కి టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి వర్తమానం అందింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్ లో అంతరిక్ష ప్రయోగ ,వాణిజ్య ,పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
ఈ కేంద్రం నిర్మాణంలో మొదటిగా కొద్ది మంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులతో ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 2029 మార్చి నెలలో నిర్వహించబోయే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ మొదటి అంతరిక్ష ప్రారంభ యాత్ర బృందంలో భారతదేశం నుంచి జాహ్నవి దంగేటి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది.
ఇప్పటికే మూడుసార్లు అంతరిక్ష యాత్రలు పూర్తిచేసిన అమెరికాకుచెందిన సీనియర్ వ్యోమగామి బిల్ మేక్ ఆర్థర్ నేతృత్వంలో టైటాన్స్ స్పేస్ మిషన్ తొలి అంతరిక్ష యానం చేయనుంది.ఇందుకు సంబందించిన వ్యోమగామి అభ్యర్థుల కు వచ్చేఏడాది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఇంత వరకు భారత సంతతికి చెందిన అమెరికన్లు సునీతా విలియమ్స్ ,కల్పనా చావ్లా వ్యోమగాములుగా అంతరిక్షంలో అడుగిడారు. అయితే జాహ్నవి దంగేటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించింది. చిన్నతనంనుంచే చంద్రుడిపై అడుగుపెట్టాలని ధృఢనిశ్చయంతో ఆ దిశగా తన లక్ష్యాన్ని మలుచుకుంది.ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన జాహ్నవి ఇంజనీరింగ్ మాత్రం పంజాబ్ లో పూర్తిచేసింది. 2021 లో అమెరికా లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కి భారతదేశం నుంచి ఎంపికై రికార్దు సృష్టించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల్లో జరుగుతున్న వ్యోమగామి శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది. పోలెండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించిన జాహ్నవిఐస్ లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్లో శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఇక్కడే 1965 , 1967 సంవత్సరాల్లో అమెరికా అపోలో ఆస్ట్రోనాట్ లు శిక్షణ పొందారు. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం కూడా జియో స్పేస్ సెంటర్ లోనే శిక్షణ పొందటం జాహ్నవికి మరింత స్ఫూర్తి కలిగించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jahnavi-dangeeti-palakollu-girl-astronaut-39-200552.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.