అధికారంలో వున్న సమయంలో ఎవరో అడిగితే, జాతీయ రాజకీయాల గురించి మనకెందుకన్నా అని ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెప్పిన జగనన్న ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. పనిలో పనిగా తన మనసులో వున్న బాధని కూడా వెళ్ళగక్కుతున్నారు. మంగళవారం నాడు వెలువడిన హర్యానా ఎన్నికల ఫలితాల మీద జగనన్న తన అమూల్యమైన అభిప్రాయాన్ని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆయన ట్వీట్ సారాంశం ఇదిగో... ‘‘మరోసారి ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ఎంతమాత్రం భిన్నంగా లేవు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా కూడా వుండాలి. ఈ రెండిటినీ సాధించడానికి ఏకైక మార్గం పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. మనం కూడా ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే పేపర్ బ్యాలెట్ వైపు వెళ్లే సమయం ఆసన్నమైంది. పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు అందరూ ముందుకు రావాలి’’ అని జగన్ తన ట్వీట్లో వక్కాణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-x-message-on-paper-ballet-25-186574.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.