జగన్ ఒక సీతయ్య.. ఎవరి మాటా వినడు!

Publish Date:May 16, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన పార్టీ నేతలే కాదు, ఉన్నతాధికారులూ చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలూ, సూచనలూ స్వీకరించరు. తోచింది చేసేస్తారు. వాటి పర్యవశానాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనను నమ్ముకున్న వారూ నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సీతయ్య ఎవడి మాటా వినడు అని. జగన్ సీతయ్యకు మించి..ఆయన కూడా ఎవడి మాటా వినరు. వినకపోవడమే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. ఔను.. ఈ విషయం ఎవరో కాదు.. గతంలో  జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట.

ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ, ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, ముందు వెనుకలు ఆలోచించరనీ, ఎవరైనా చెప్పినా వినరనీ, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారపై ఫైర్ అయిపోతారనీ చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకూ, ఆయన పార్టీకీ కూడా భారీగా డ్యామేజి జరిగిందని వివరించారు.  జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారనీ, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరనీ వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వీ చెప్పారు.  

ఇందుకు జగన్ తీసుకువచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని అయన అన్నారు. జగన్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక, మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గలేదు. అధికారులు ఏమైనా చెప్పబోయినా, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేది లేదు. అని కరాఖండీగా చెప్పేసి వాళ్ల నోళ్లు మూయించే వారని ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వవరించారు.

జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారనీ, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారనీ కూడా ఎల్వీ వివరించారు. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వోద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారిని ఎల్వీ గుర్తు చేసుకునే వారు. ఒక రాజకీయ  నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు.  ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైనా  సీరియస్ నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు.

జగన్ ముందు చూపు లేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనీ, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనీ వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలూ కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.  మొత్తం మీద జగన్ ప్రభుత్వ పనతానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు. 

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.