అలవి కాని అమ్మ సామెతలా జగన్ తీరు

Publish Date:Apr 11, 2025

Advertisement

అనగనగా ఒక ఊళ్లో ఒకామె ఉంది. మహా రచ్చలమారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుంది. ఎలాగంటే.. ఆమెను ఎవరైనా ‘అమ్మా’ అని పిలిస్తే.. ‘ఠాట్.. నన్ను అమ్మా అంటావా.. అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా.. నేనేమైనా నీ అయ్యకు పెళ్లాన్నా..’ అంటూ గొడవకు దిగుతుంది. అలాకాకుండా, ‘ఏమండోయ్..’ అని పిలిస్తే.. ‘నేనేమైనా నీకు పెళ్లాన్నా.. అంత చనువుగా పిలుస్తున్నావ్’ అంటూ దానికి కూడా గొడవకు దిగుతుంది. అలాంటి వారి గురించి ‘అలవిగాని ఆడదాన్ని అమ్మా అన్నా తప్పే.. ఏమేవ్ అన్నా తప్పే..’ అంటూ పల్లెపట్టుల్లో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పాపిరెడ్డి పల్లె పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల భద్రత, రక్షణ అడిగారు.. పోలీసులు ఏకంగా ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులో ఆ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఈ సామెత కథ మాదిరిగా ఆయన అనుసరించిన ధోరణిని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. 

జగన్  భద్రతను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే పోలీసులు ఆయన అడిగిన చోట కాకుండా.. పాపిరె డ్డిపల్లెకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కుఅనుమతి ఇచ్చారు. పైగా హెలిప్యాడ్ వద్దకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావొద్దని నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. కానీ.. జగన్ రాకకు జనాన్ని తరలించిన స్థానిక నాయకులు మాత్రం.. పోలీసుల మాట వింటే తాము వైసీపీ నాయకులు ఎందుకవుతాం అన్నట్టుగా వ్యవహరించారు. తరలించి తీసుకువచ్చిన జనాలనందరినీ హెలిప్యాడ్ వద్దకు కూడా తోలారు. తీరా అక్కడి పరిస్థితి ఏమిటి? జనం మిక్కిలిగా వచ్చేశారు.. వారిని అదుపు చేయడానికి పోలీసులు ఏ కొంచెం కఠినంగా వ్యవహరించినా సరే.. ‘మా కార్యకర్తల్ని కొట్టేస్తున్నారు.. మా మీద పోలీసులు దాడిచేస్తున్నారు..’ అంటూ గోల చేయాలన్నది వారి కోరిక. అప్పటికీ పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులమీదనే రాళ్లురువ్వి దాడికి దిగారు. అప్పటికీ.. పోలీసులు సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.  తీరా జనం తాకిడి వల్ల హెలికాప్టర్ కాస్త దెబ్బతింది. తీరా ఇప్పుడు ‘పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు. జనం వస్తోంటే చూస్తూ కూర్చున్నారు..’ అని మళ్లీ పోలీసుల మీదనే నిందలేస్తున్నారు. 

జగన్ వ్యవహార సరళిని గమనిస్తే.. పాపిరెడ్డి పల్లిలో పోలీసులు ఎంత పటిష్ఠ ఏర్పాట్లు చేసినా సరే.. ఏదో ఒక రకంగా వారి మీద నిందలు వేయాలని, శాంతిభద్రతలు విఫలమవుతున్నాయని ప్రభుత్వం మీద బురద చల్లాలని ముందే ఫిక్సయిపోయి అక్కడకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. బట్టలూడదీసి కొడతానని జగన్ కారుకూతలు కూసినా సరే.. పోలీసులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. జగన్ మాత్రం.. ముందే రెండు స్క్రిప్టులు తయారుచేసుకుని ఉన్నట్టుగా.. అంతా ప్రశాంతంగా జరిగినా సరే.. హెలిపాడ్ వద్ద జనం తాకిడి గురించి తమ పార్టీ నాయకులు చేసిన తప్పిదానికి పోలీసులను నిందిస్తున్నారు. హెలిపాడ్ వద్ద గుమికూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద పోలీసులు కేసు పెట్టి, అందరికీ నోటీసులు ఇస్తేగానీ ఆపార్టీ కుట్రలు బయటకురావని, వారి లేకిబుద్ధులు బయటపడవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.