జగన్ కొంప ముంచిన కొమ్మినేని!

Publish Date:May 14, 2024

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ అభిమాన వర్గాలు ‘‘ఓరి నాయనో.. ఈ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మా జగనన్న కొంప ముంచాడు నాయనో’’ అని లబోదిబో అంటున్నారు. జగన్ మీడియాలో కీలక స్థానంలో, జగన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు పదవి కూడా వెలగబెడుతున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఈయన జగన్ గురించి సాక్షి మీడియాలో ఇచ్చే బిల్డప్పులు వింటే చెవుల వెంట రక్తం కూడా కారే అవకాశాలు వుంటాయి. జగన్ విషయంలో పదిపైసలంత మేటర్ వుంటే, అది కొమ్మినేని నోట్లోంచి పది వేల రూపాయలంత రేంజ్‌లో బయటకి వస్తుంది. కొమ్మినేని పేరుకే జర్నలిస్టుగానీ, ‘జగన్ భజంత్రీల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు అని గిట్టనివారు అంటూ వుంటారు. 

సరే, ఈయన మంగళవారం నాడు సాక్షి టీవీ కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే జగన్ నినాదం అయిన ‘వైనాట్ 175’ అనే నినాదానికి అనుకూలంగా వైసీపీ అదరహో, కూటమి బెదరహో, అధికారం జగన్‌దేనహో అని నానా హడావిడి చేయాలి. కానీ ఆయన ఎలాంటి హడావిడి లేకుండా, చూద్దామన్నా నెత్తుటి చుక్క కూడా కనిపించని ముఖంతో ‘ఈసారి కూడా జగన్ విజయం సాధిస్తారు.. అని సర్వేలు కూడా చెబుతున్నాయి. నేను కూడా కొందరు సర్వేవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళలో చాలామంది జగనే గెలుస్తారని చెప్పారు’ అని చాలా చప్పచప్పగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే పెద్ద అబద్ధం ఆడలేను అన్నట్టుగా తేల్చేశారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకి అన్నీ అబద్ధాలు చెప్పారట, అలాగే పోలింగ్ సందర్భంగా భారీగా హింసకు దిగారట... అని కొమ్మినేని శ్రీనివాసరావు దిగాలుగా ముఖం పెట్టి చెబుతుంటే, పాయే.. వైసీపీ పని అయిపాయే అని ఎవరికైనా అనిపించడం ఖాయం..

పోనీ, కొమ్మినేని గారు అక్కడితో ఆగలేదు.. జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది.. ఎవరైనా గతంలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి ఇంకా నాలుగైదు సీట్లు పెరుగుతాయి అని చెబుతారుగానీ, ఈయనేంటయ్యా బాబు.. దాదాపు పద్నాలుగు సీట్లు నిర్దాక్షిణ్యంగా కోసేశారు అని లబోదిబో అంటున్నారు. మన మీడియాలోనే మనం ఈరకంగా కోసేసుకుంటే, రియల్‌గా ఓటర్లు ఇంకెంత కోసేశారో అని కెవ్వుమంటున్నారు.

కొమ్మినేని వైసీపీ వర్గాల మీద బాంబులు వేస్తూ మరికొంత విశ్లేషణ చేశారు. ఉత్తరాంధ్రలో వున్న 34 సీట్లలో 20 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. అదేంటన్నా.. మన జగనన్న వైజాగ్ రాజధాని అని పోరాటం చేస్తుంటే, ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మనకి వస్తున్నాయని చెప్పాలిగానీ, 14 సీట్లు కట్ చేశారేంటన్నా.. ఇదెక్కడి న్యాయం కొమ్మినేని సారూ అని వైసీపీ వర్గాలు మొత్తుకుంటున్నాయి. 

జగన్ మొదటి నుంచి వైనాట్ 175 అంటే, కొమ్మినేని వారు మాత్రం 100 నుంచి 110 సీట్లు వస్తాయని ఫైనల్ చేశారు. ఈయన తీర్పు విని వైసీపీ వర్గాలు గొల్లుమంటున్నాయి. 175 వస్తాయి అని బిల్డప్పు ఇవ్వాలిగానీ, ఈరకంగా 110 బోర్డర్ పెట్టేశావేంటి దేవుడా అని బావురుమంటున్నాయి. సాక్షి మీడియా కాంపౌండ్లోనే పరిస్థితి ఇంత నీరసంగా వుందంటే, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.