ఐప్యాక్ ఆఫీసుకి జగన్.. మతలబేంటి?

Publish Date:May 16, 2024

Advertisement

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ తనకు సహకారం అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓటమి కన్ఫమ్ అయిన బాధ ఒక వైపు, యూరప్ వెళ్ళడానికి తట్టాబుట్టా సర్దుకునే బిజీ మరో వైపు. అయినప్పటికీ, జగన్ తీరిక చేసుకుని మరీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి ఎందుకు వెళ్ళారా అనే సందేహాలు కలగటం సహజం.

విజయవాడలో వున్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనధికార పర్యటన అయినప్పటికీ, అన్ని రకాల అధికారిక ఖర్చులతో ఆయన అక్కడకి వెళ్ళారు. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మంది ఐప్యాక్ ఉద్యోగులు జగన్‌ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు. అన్నికంటే వింత ఏమిటంలే, జగనే స్వయంగా ఒక సెల్ఫీ క్లిక్ చేశారు. తర్వాత ఐ ప్యాక్ సభ్యులు మీరు మళ్ళీ ఘన విజయం సాధిస్తారు అని ముక్తకంఠంతో అరిచారు. జగన్ కూడా, అంతకు ముందుకంటే భారీ విజయం సాధిస్తాను అని చెప్పారు. అది విని అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు... సీఎం.. సీఎం అని అరిచారు.. ఈ ప్రహసనం అయిపోగానే జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కి చేరుకున్నారు.

అసలింతకీ జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే, గత ఎన్నికల తర్వాత జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. వాళ్ళకి థాంక్స్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉద్దేశం లేకపోయినా, వెళ్ళక తప్పని పరిస్థితి.. ఎందుకంటే, ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాపచుట్టేసినట్టే అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక జగన్ గత ఎన్నికల తరహాలో కాకుండా, ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళకుండా ఊరుకుంటే, జగన్ కూడా చేతులు ఎత్తేశాడనే మెసేజ్ వెళ్ళే అవకాశం వుంది కాబట్టి ఆయనకి వెళ్ళక తప్పలేదు.

ఐపాక్‌తో గత ఎన్నికల వరకు అనుబంధం వున్న ప్రశాంత్ కిషోర్ దానిని కొంతకాలం క్రితం తెంచుకున్నారు. ఈమధ్య జర్నలిస్టు రవిప్రకాష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ని ప్రశాంత్ కిషోర్ భారీగా విమర్శించారు. చేసిన మేలును మరచిపోవడం కంటే పెద్ద పాపం మరొకటి వుండదని భగవద్గీతలో చెప్పారని, జగన్ తాను చేసిన మేలును మరచిపోయారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఐప్యాక్ సంస్థకి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి జగన్‌ది. ఒకవేళ జగన్ వెళ్ళకపోతే, చూశారా.. జగన్ ఈసారి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళలేదు. జగన్‌కి కృతజ్ఞత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నిజమే అనే లోకనింద వస్తుందని భయపడి జగన్ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఓ పనైపోయింది బాబూ అనిపించుకున్నారు.

By
en-us Political News

  
తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ నాలుగో తేదీన తమ ఇళ్ళలో, తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో వున్నారు.
గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గిన ధరలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గడంతో అందుకు అనుగుణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.
ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ కేడర్ గత పదేళ్లుగా చెక్కుచెదరకుండా నిలబడినప్పటికీ, అనివార్యంగా తెలుగుదేశం ఆ రాష్ట్రంలో ఎన్నికల పోటీకి దూరంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో కానీ తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.
సాధారణ ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. శనివారం ( జూన్ 1) తుది విడత పోలింగ్ జరుగుతోంది. అంచనాలన్నీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి గట్టిగా పుంజుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అటువంటి తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు శనివారం (జూన్ 1) పసాయంత్రం 3 గంటలకు సమావేశమౌతున్నాయి.
లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కే సమయంలో కళ తప్పి, కాంతివిహీనం అయిపోయి వున్న ఆయన ముఖం ఇప్పుడు రంగు తేలింది. మిలమిలలాడుతోంది. ముఖ్యంగా బుగ్గలయితే బూరెల్లాగా పొంగాయి.
దేశంలో చివరి దైన ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్1) ప్రశాంతంగా సాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-3
అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన పదవీ విరమణ చేశారు
ఏబీవీకి జగన్ కరుణించి పోస్టింగ్ ఇవ్వలేదు.. జగన్ ఇవ్వనుగాక ఇవ్వను అని పట్టుదల మీద వుంటే, ఏబీవీ పోరాడి సాధించుకున్నారు. 
బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయినా కేసీఆర్‌కు ఇంకా తత్త్వం బోధపడినట్లు లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆరు మాసాల్లోపే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలో చేరిపోతున్నారు. 4వ తేదీ త‌రువాత‌ ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో ప్ర‌జ‌ల స్పంద‌న‌, తాజా పరిస్థితులు కేసీఆర్‌కు మింగుడుపడటం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ క్యాడ‌ర్‌ను కాపాడుకోవాల‌నుకుంటున్నారు.
సరిగ్గా  సార్వత్రిక ఎన్నికల  కౌంటింగ్ కు ఒక రోజు ముందు ఎపిలో పరిపాలనా విభాగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఒక రోజు మాత్రమే అధికారంలో ఉంటుంది అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో డిప్యూటి కలెక్టర్లపై బదిలీవేటు సంచలనమైంది. 
మునుపెన్నడూ లేని విధంగా ఈ యేడు లోకసభ ఎన్నికల వ్యయం తడిసి మోపెడయ్యింది.  లోక్‌సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.