వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.ఎపిలో వైకాపా ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో వచ్చింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైకాపా అవమానభారంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం అయితే జరిగింది కానీ జగన్ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ గడపదొక్కలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ తుంటి ఎముక విరిగి యశోదాహస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో జగన్ హైదరాబాద్ కు వచ్చారు. అప్పట్లో లోటస్ పాండ్ వెళతారని అందరు అనుకున్నారు. కానీ జగన్ అప్పుడు కూడా లోటస్ పాండ్ వెళ్లలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. హైదరాబాద్ సేప్ జోన్ కాదని జగన్ డిసైడైపోయారు. ఈ కారణంగానే బెంగుళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన డికె శివకుమార్ కర్ణాటక డిప్యూటి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చని జగన్ భావిస్తున్నారు. కాబట్టే బెంగుళూరుకు షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. వైకాపా తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని జగన్ కు తెలిసి పోయింది. దీంతో ఆయన ఎక్కువగా బెంగుళూరులోని యెలహంక ప్యాలెస్ కు పరిమితమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కట్టిన తాడేపల్లిలోని వైకాపా కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చి వేసింది. ప్రస్తుతం తాడేపల్లిలో ఆయన నివాసానికి తాళం వేసే ఆలోచనలో ఉన్నారు. రాజకీయంగా అధోపాతాళానికి పడిపోయిన జగన్ మళ్లీ కోలుకునే అవకాశం లేదు. అవమానభారంతో కుమిలిపోతున్న జగన్ మొహం చాటేయాలని డిసైడ్ అయ్యారు. తాను గత 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న యెలహంక ప్యాలెస్ కు గత పదేళ్లుగా దూరంగా ఉన్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు ఆనుకుని 30 ఎకరాల్లో యెలహంక ప్యాలెస్ ఉంది. వైకాపా పెట్టిన తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. వైకాపా పెట్టిన తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. ఎపిలో వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా తాడేపల్లి నివాసానికి పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత జగన్ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. తెలుగు దేశం ప్రభుత్వాన్ని నిలువరించే సత్తా జగన్ కు లేకపోవడంతో బిస్తర్ ఎత్తేశాడని ప్రచారం జరుగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-was-shifted-to-bangalore-with-the-burden-of-defeat-39-182180.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.